లంచం పిచ్చి.. పాపం పసివాడు
బహ్రెయిక్: లంచానికి కక్కుర్తిపడి అది అడగగానే ఇవ్వలేదని నిర్లక్ష్యం చేయడంతో ఓ పది నెలల పసిబిడ్డ చనిపోయింది. మానవత్వం తలదించుకునే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రభుత్వ వైద్యశాలలో చోటుచేసుకుంది. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి ఓ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. షివదత్త్ అనే వ్యక్తి ఓ దినసరి కూలీ. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. తన పది నెలల కృష్ణ అనే తన కుమారుడికి తీవ్ర జ్వరం రావడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు.
సూదిమందు వేసేందుకు నర్సుకు 100 రూపాయలు, పిల్లల వార్డులో బెడ్ ఏర్పాటుచేసేందుకు స్వీపర్ కు రూ.30 లంచంగా ఇచ్చాడు. ఆ లంచం ఇచ్చేంత వరకు వారు ఆ రెండు సేవలు అందించలేదు. అదీ కాకుండా.. ఆ పసి బాలుడికి అవసరం ఉన్న సూదిమందు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వేరేది ఇవ్వడంతో అది వికటించి ఆ బాలుడు చనిపోయాడు. ఈ విషయం బయటకు తెలిసి ప్రభుత్వం పరువుపోయే పరిస్థితి రావడంతో ఆరోగ్యమంత్రి నేరుగా స్పందించి విచారణకు ఆదేశించాడు.