న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. ఆ కుంభకోణంలో ముడుపులు ఇచ్చింది, తీసుకున్నది యూపీఏ సర్కార్ హయాంలో జరిగినందునే సోనియా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
లంచాలు ఇచ్చినట్లు నిరూపితమైందని, వాటిని తీసుకున్నదెవరో సోనియానే చెప్పాలన్నారు. సోనియా దేనికీ భయపడరంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. కాగా బీజేపీ ఆరోపణలన్నీ అవాస్తవాలని సోనియా గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని, తద్వారా నిజం బయటకు వస్తుందన్నారు.