న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి పలు వాహన కంపెనీల వార్షిక వాహన విక్రయాలు మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జోరుగా నమోదయ్యాయి. మారుతీ మొత్తం వాహన విక్రయాలు 9.8 శాతం వృద్ధితో 15,68,603 యూనిట్లకు చేరాయి. దేశీ అమ్మకాలు 10.7 శాతం వృద్ధితో14,44,541 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ వాహన విక్రయాల్లో 5.2 శాతం వృద్ధి నమోదైంది. నిస్సాన్ వాహన అమ్మకాలు ఏకంగా 45 శాతం వృద్ధితో 57,315 యూనిట్లకు పెరిగాయి.
టాటా మోటార్స్ వాహన విక్రయాల్లో 6 శాతం వృద్ధి నమోదైంది. రెనో వాహన అమ్మకాలు ఏకంగా 88.4 శాతం వృద్ధితో 1,35,123 యూనిట్లకు పెరిగాయి. కాగా కేవలం మార్చి నెలలో మారుతీ దేశీ వాహన అమ్మకాలు 7.7 శాతం వృద్ధితో 1,27,999 యూనిట్లకు పెరిగాయి. ఇదే నెలలో హోండా కార్స్ దేశీ వాహన విక్రయాల్లో 8.7 శాతం వృద్ధి నమోదైంది. ఫోర్డ్ ఇండియా దేశీ వాహన విక్రయాలు 15 శాతం వృద్ధితో 8,700 యూనిట్లకు చేరుకున్నాయి.
టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
Published Sun, Apr 2 2017 2:36 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
Advertisement
Advertisement