నిర్మాణ్ భవన్ లో వెంకయ్య ఆకస్మిక తనిఖీలు!
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు గురువారం రోజున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్మాణ్ భవన్ లోని తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో అధికారులు ఎక్కువ సంఖ్యలో విధులకు హాజరకాకపోవడం వెంకయ్యనాయుడు దృష్టికి వచ్చింది.
ఉదయం 9 గంటలకే నిర్మాణ్ భవన్ చేరుకున్న వెంకయ్యనాయుడు అధికారుల గదులను తనిఖీ చేయగా.. ఎక్కువ మంది విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించారు. వెంకయ్య నాయుడు తనిఖీలు చేపట్టిన సమయంలో అధికారులు ఎక్కువ సంఖ్యలో గైర్హాజరైనట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు.
కారిడార్ లో విద్యుత్ వైర్లు వేలాడుతుండటం, క్యాంటిన్ అపరిశుభ్రంగా ఉంటడంపై వెంకయ్య తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఆతర్వాత సీనియర్ అధికారులు, కార్యదర్శితో భేటి నిర్వహించి.. అసంతృప్తిని వ్యక్తం చేశారు.