nirman bhawan
-
ఉద్యోగులపై వెంకయ్యనాయుడు సీరియస్
న్యూఢిల్లీ: నిర్మాణ్ భవన్ లో కేంద్ర పట్టాభివృద్ధిశాఖామంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేశారు. విధులకు ఉద్యోగులు ఆలస్యంగా హాజరవుతున్నారని సమాచారం అందుకున్న వెంకయ్య నిర్మాణ్ భవన్ లోని అన్ని విభాగాల్లో తనిఖీలు చేశారు. వెంకయ్య తనిఖీలు నిర్వహించిన సమయంలో ఎక్కువ సీట్లు ఖాళీగా కనిపించాయి. దాంతో ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు వెంకయ్య సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. గతంలో కూడా నిర్మాణ్ భవన్ లో వెంకయ్య తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
నిర్మాణ్ భవన్ లో వెంకయ్య ఆకస్మిక తనిఖీలు!
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు గురువారం రోజున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్మాణ్ భవన్ లోని తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో అధికారులు ఎక్కువ సంఖ్యలో విధులకు హాజరకాకపోవడం వెంకయ్యనాయుడు దృష్టికి వచ్చింది. ఉదయం 9 గంటలకే నిర్మాణ్ భవన్ చేరుకున్న వెంకయ్యనాయుడు అధికారుల గదులను తనిఖీ చేయగా.. ఎక్కువ మంది విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించారు. వెంకయ్య నాయుడు తనిఖీలు చేపట్టిన సమయంలో అధికారులు ఎక్కువ సంఖ్యలో గైర్హాజరైనట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. కారిడార్ లో విద్యుత్ వైర్లు వేలాడుతుండటం, క్యాంటిన్ అపరిశుభ్రంగా ఉంటడంపై వెంకయ్య తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఆతర్వాత సీనియర్ అధికారులు, కార్యదర్శితో భేటి నిర్వహించి.. అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
ఓటు వేసిన సోనియా గాంధీ
-
ఓటు వేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెంట్రల్ న్యూఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ కేంద్రంలో సోనియా ఓటు వేశారు. సోనియాతో పాటు ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, న్యూఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీలు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఔరంగజేబ్ లేన్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తిలక్ నగర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.