surprise check
-
లేటుగా వస్తారా.. నేను పట్టేస్తా: కేంద్రమంత్రి
గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు మారగానే అక్కడి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయాన్నే 9.30 గంటలకు అక్కడకు వెళ్లిన వెంకయ్య.. ఎవరెవరు సమయానికి వస్తున్నారు, ఎవరు రావట్లేదు, కార్యాలయంలో శుభ్రత ఎలా ఉందనే అంశాలను పరిశీలించారు. సమయానికి రాని అధికారుల నుంచి వివరణ కోరారు. వెంకయ్య నాయుడితో పాటు ఆశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా ఈ తనిఖీలకు వెళ్లారు. మంత్రులు స్వయంగా పలువురు అధికారులు, వారి సహాయక సిబ్బంది గదులను చూశారు. ఆఫీసులో బాత్రూంలు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేశారు. వివిధ గదులు, కారిడార్లలో కరెంటు స్విచ్‌లు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని సైతం చూశారు. శాస్త్రి భవన్లో ఉదయం 9.30 గంటలకు తనిఖీ చేశానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. సమయపాలన గురించి సంబంధిత సంయుక్త కార్యదర్శులతో సమీక్షించానన్నారు. Made a surprise check of attendance and cleanliness at Shastri Bhawan today at sharp 9:30am pic.twitter.com/107f90zZmt — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016 Directed concerned Joint Secretaries to review issues related to punctuality and cleanliness in the offices on daily basis... — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016 Explanation sought from those who were not present at the time of inspection... — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016 -
ఆస్పత్రిలో మాజీ సీఎం హల్చల్
బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజి ఆస్పత్రికి ఉన్నట్టుండి ఓ అనుకోని అతిథి వచ్చారు. ఆయన్ను చూసి పేషెంట్లు ఆశ్చర్యపోగా.. డాక్టర్లు పరుగు పరుగున వచ్చారు. ఆయనే.. ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్. ఆయనకు తెలిసున్నవాళ్లు ఎవరో చికిత్స పొందుతుంటే చూసేందుకు వచ్చారేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. తన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో.. అతడి తరఫున ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు లాలు వచ్చినట్లు కాసేపటికి అందరికీ అర్థమైంది. లాలు నేరుగా రోగుల వద్దకు వెళ్లి, ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. పలు వార్డులను తనిఖీ చేశారు. నిజానికి 1997లో గడ్డి స్కాంలో లాలును జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు ఆయన ఇదే ఆస్పత్రిలో చాలా నెలల పాటు ఓ వీఐపీ రూంలో 'పేషెంటు'గా గడిపారు. అయితే, తాను అక్కడకు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఓ పేషెంటును కలిసేందుకు వెళ్లానని, దారిలో ఈ ఆస్పత్రి కనిపిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని ఆగానని లాలు ఆ తర్వాత మీడియాతో అన్నారు. ఈ వ్యవహారం సీఎం నితీష్‌కుమార్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. లాలు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు.. ప్రధానంగా బీజేపీ విరుచుకుపడే అవకాశం స్పష్టంగా ఉంది. -
మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీలు
-
నిర్మాణ్ భవన్ లో వెంకయ్య ఆకస్మిక తనిఖీలు!
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు గురువారం రోజున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్మాణ్ భవన్ లోని తన మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సమయంలో అధికారులు ఎక్కువ సంఖ్యలో విధులకు హాజరకాకపోవడం వెంకయ్యనాయుడు దృష్టికి వచ్చింది. ఉదయం 9 గంటలకే నిర్మాణ్ భవన్ చేరుకున్న వెంకయ్యనాయుడు అధికారుల గదులను తనిఖీ చేయగా.. ఎక్కువ మంది విధులకు హాజరు కాకపోవడాన్ని గమనించారు. వెంకయ్య నాయుడు తనిఖీలు చేపట్టిన సమయంలో అధికారులు ఎక్కువ సంఖ్యలో గైర్హాజరైనట్టు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. కారిడార్ లో విద్యుత్ వైర్లు వేలాడుతుండటం, క్యాంటిన్ అపరిశుభ్రంగా ఉంటడంపై వెంకయ్య తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఆతర్వాత సీనియర్ అధికారులు, కార్యదర్శితో భేటి నిర్వహించి.. అసంతృప్తిని వ్యక్తం చేశారు.