
లేటుగా వస్తారా.. నేను పట్టేస్తా: కేంద్రమంత్రి
గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు మారగానే అక్కడి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయాన్నే 9.30 గంటలకు అక్కడకు వెళ్లిన వెంకయ్య.. ఎవరెవరు సమయానికి వస్తున్నారు, ఎవరు రావట్లేదు, కార్యాలయంలో శుభ్రత ఎలా ఉందనే అంశాలను పరిశీలించారు. సమయానికి రాని అధికారుల నుంచి వివరణ కోరారు. వెంకయ్య నాయుడితో పాటు ఆశాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా ఈ తనిఖీలకు వెళ్లారు.
మంత్రులు స్వయంగా పలువురు అధికారులు, వారి సహాయక సిబ్బంది గదులను చూశారు. ఆఫీసులో బాత్రూంలు ఎలా ఉన్నాయో కూడా చెక్ చేశారు. వివిధ గదులు, కారిడార్లలో కరెంటు స్విచ్లు ఎలా ఉన్నాయో అనే విషయాన్ని సైతం చూశారు. శాస్త్రి భవన్లో ఉదయం 9.30 గంటలకు తనిఖీ చేశానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. సమయపాలన గురించి సంబంధిత సంయుక్త కార్యదర్శులతో సమీక్షించానన్నారు.
Made a surprise check of attendance and cleanliness at Shastri Bhawan today at sharp 9:30am pic.twitter.com/107f90zZmt
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 11 July 2016