
న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు, భూతాపం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ప్రధాన సమస్యలని, వీటికి వ్యతిరేకంగా కలసి పోరాడాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలోని ఇండియా హేబిట్ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ‘వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్– 2019’ను సోమవారం ఆయన ప్రారంభించారు.