సాక్షి, చెన్నై: తమిళ నేత, ఎండీఎంకే చీఫ్ వైగోను మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్నారు. ఎల్‌టీటీఈతో సంబంధాలపై అక్కడే చాలాసేపు ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను దేశంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు.
‘మలేసియాకు ప్రమాదకారుల’ జాబితాలో వైగో పేరు ఉండడమే అందుకు కారణమన్నారు. వైగోను మలేసియా ఎయిర్‌లైన్స్ విమానంలో తిరిగి భారత్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రామస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవడానికి వైగో మలేసియాకు చేరుకున్నారు.