పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు  | Villagers Beating Up A Man Who Give Slogans In Favor Of Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు 

Published Mon, Feb 18 2019 5:17 AM | Last Updated on Mon, Feb 18 2019 5:17 AM

Villagers Beating Up A Man Who Give Slogans In Favor Of Pakistan - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టిన ముగ్గురు యువకులను నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌వాసులు చితకబాదారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు మోర్తాడ్‌లోని రథం గుడి వద్దనున్న హెయిర్‌కటింగ్‌ సెలూన్‌ను లీజ్‌కు తీసుకుని నడుపుకుంటున్నారు. వారు మోర్తాడ్‌కు చెందిన ఓ యువకుడితో కలసి పాక్‌కు అనుకూలంగా, మన దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీడియోను చిత్రీకరించారు. అనంతరం దానిని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు. దీంతో ఆగ్రహావేశాలకు గురైన స్థానికులు వారిని పట్టుకుని చితకబాదారు. దీంతో మోర్తాడ్‌ యువకుడితోపాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు అక్కడినుంచి పరారయ్యారు. మరో యువకుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. మోర్తాడ్‌ పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement