కోలారు కీర్తి కిరీటం కేఆర్‌ నందిని | we are very proud to be civils topper KR Nandini belongs to kolaru | Sakshi
Sakshi News home page

కోలారు కీర్తి కిరీటం కేఆర్‌ నందిని

Published Sun, Jun 11 2017 7:20 AM | Last Updated on Tue, Sep 5 2017 1:22 PM

కోలారు కీర్తి కిరీటం కేఆర్‌ నందిని

కోలారు కీర్తి కిరీటం కేఆర్‌ నందిని

సివిల్స్‌ ప్రథమ ర్యాంకర్‌ నందినికి ఘన సన్మానం
కోలారు: యూపీఎస్‌సీలో ప్రతిభ చాటి దేశ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కోలారువాసి కేఆర్‌ నందిని ప్రతిభాపాటవాలు జిల్లాకే గర్వకారణమని వక్తలు కొనియాడారు. నగరంలోని టి.చన్నయ్య రంగమందిరంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం నందినిని ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు మంజునాథ్‌ మాట్లాడుతూ కృషి, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న నందిని యువతకు ఆదర్శమని ప్రశంసించారు.

తన ప్రతిభాపాటవాలతో నందిని రాష్ట్రానికే కీర్తి తెచ్చారని అభినందించారు. అనంతరం మైసూరు పేటతో సత్కరించి ఘనంగా సన్మానించారు. నందిని మాట్లాడుతూ.. కష్టపడి సాధన చేసి లక్ష్యాన్ని చేరుకున్నానన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం కార్యదర్శి కేబీ అశోక్, కోశాధికారి ఎస్‌.చౌడప్ప, దైహిక శిక్షకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  శ్రీనివాసగౌడ, కన్నడ సాహిత్య పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు నాగానంద కెంపరాజ్‌, నందిని తల్లిదండ్రులు రమేష్, విమల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement