విద్యార్థులకు జరిగిన దానికి విచారిస్తున్నాం: అమెరికా | we regret what happened with indian students, says richard verma | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు జరిగిన దానికి విచారిస్తున్నాం: అమెరికా

Published Thu, Dec 24 2015 5:16 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM

విద్యార్థులకు జరిగిన దానికి విచారిస్తున్నాం: అమెరికా - Sakshi

విద్యార్థులకు జరిగిన దానికి విచారిస్తున్నాం: అమెరికా

భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపేసిన ఘటనపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. పరిస్థితిని తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని.. వాస్తవాలను సేకరిస్తున్నామని భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులు కొన్నాళ్ల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించిన ఒక రోజు తర్వాత అమెరికా నుంచి ఈ స్పందన రావడం గమనార్హం.

కాలిఫోర్నియాలోని రెండు విశ్వవిద్యాలయాలలో చేరేందుకు వెళ్తున్న విద్యార్థులను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వాళ్లు అడ్డుకుని తిప్పి పంపేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటన వల్ల కొంతమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులపై పడిన ప్రభావానికి తాము విచారం వ్యక్తం చేస్తున్నామని రిచర్డ్ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి పరిస్థితి మొత్తాన్ని తాము డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీతో సమీక్షిస్తున్నామని, భారత ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవాలను ఇంకా సేకరిస్తున్నట్లు వివరించారు.

భారత, అమెరికా విద్యార్థుల మధ్య విద్యా సంబంధ కార్యక్రమాలకు అమెరికా ఎప్పటికీ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుందని, వీటివల్ల కొన్ని దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని రిచర్డ్ వర్మ అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement