Richard Verma
-
రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి దక్కింది. శాఖకు సంబంధించిన నిర్వహణ, వనరుల వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. దీన్ని అత్యంత శక్తిమంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన సీఈఓ స్థాయి పోస్టుగా పరిగణిస్తుంటారు. 54 ఏళ్ల వర్మ నియామకాన్ని సెనేట్ 67–26 ఓట్లతో ఆమోదించింది. మాజీ దౌత్యవేత్త అయిన వర్మ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ (న్యాయ వ్యవహారాలు)గా కూడా పని చేశారు. 2015 నుంచి రెండేళ్లపాటు భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్నారు. వర్మ 1968లో అమెరికాలోని భారతీయ కుటుంబంలో జన్మించారు. అమెరికా వైమానిక దళ స్కాలర్‌షిప్‌తో కాలేజీ చదువు పూర్తి చేశారు. లాహిగ్ వర్సిటీ నుంచి బీఎస్, జార్జ్‌టౌన్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేశారు. అనంతరం యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో జడ్జ్ అడ్వొకేట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశాధ్యక్షుని నిఘా సలహా బోర్డులో, సామూహిక జనహనన ఆయుధాలు, ఉగ్రవాద కమిషన్ సభ్యునిగా చేశారు. ప్రస్తుతం మాస్టర్‌కార్డ్ చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా ఉన్నారు. ఫోర్డ్ ఫౌండేషన్‌తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బోర్డుల్లో సభ్యునిగా, ట్రస్టీగా కొనసాగుతున్నారు. విదేశాంగ శాఖ నుంచి అత్యుత్తమ సేవా మెడల్, వైమానిక దళం నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్, కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్‌నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలోషిప్ తదితరాలు దక్కించుకున్నారు. -
భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్, రీసోర్సెస్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్ ఆమోదం తెలిపితే విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్ వర్మ అవుతారు. ఆయన 2015–17 మధ్య భారత్‌లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్‌గా, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా పని చేస్తున్నారు. -
ఎన్ఎస్జీలో చేరే అర్హత భారత్ కు ఉంది: అమెరికా
న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం దక్కకపోవడంతో అమెరికా నిరాశపడిందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. కొద్ది నెలల్లోనే సభ్యత్వం దక్కుతుందని, ఆ అర్హత భారత్‌కు ఉందని అన్నారు. ఇందుకోసం ఎన్ఎస్జీ 48 సభ్యదేశాలతో చర్చలు కొనసాగిస్తామన్నారు. భారత్ పట్ల సానుకూలత వచ్చేటట్లు చేస్తామన్నారు. పలు సభ్య దేశాలు నాన్-ఎన్పీటీ దేశాల చేరికపై అభ్యంతరాలు చెప్పడం వల్లే భారత్‌కు సభ్యత్వం రాలేదని చైనా పేర్కొంది. మా వ్యూహంతో అడ్డుకట్ట: పాక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 17 దేశాలకు రాసిన లేఖలతో పాటు పకడ్బందీగా చేసిన వ్యూహాత్మక సంప్రదింపులు భారత్‌కు ఎన్ఎస్జీ సభ్యత్వం రాకుండా అడ్డుకోగలిగాయని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ చెప్పారు. -
ఎఫ్16ల కొనుగోలులో భారత్ అభ్యంతరంపై పాక్ విస్మయం
ఇస్లామాబాద్/ముంబై: అమెరికా తమకు ఎఫ్16 యుద్ధ విమానాలను అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగించిందని పాకిస్తాన్ పేర్కొంది. భారత్ ఒకవైపు పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ మరో వైపు తమ విషయంలో ఇలా స్పందించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. భారత్ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రి ఉందని తెలిపింది. ఎఫ్16లతో ఉగ్రవాదంపై పోరులో పాక్ సామర్థ్యం పెరుగుతుందని అమెరికా సర్కారు చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాక్‌కు విమానాలను విక్రయించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సమర్థించుకున్నారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల కొనసాగింపులో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని ముంబైలో తెలిపారు. పాత ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. -
పాక్‌కు అమెరికా ఎఫ్-16ల అమ్మకం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు అణుసామర్థ్యం గల 8 ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఒప్పందం విలువ రూ.4670 కోట్లపైనే. ఈ ఒప్పందాన్ని రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా ఒబామా ప్రభుత్వ వెనకడుగు వేయడం లేదు. భారత్ తీవ్ర అసంతృప్తి.. పాక్‌కు ఎఫ్-16 విమానాలు అమ్మాలన్న అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. చాలా నిరుత్సాహానికి గురయ్యామని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ చెప్పారు. రిచర్డ్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. ఈ చర్యను భారత్ వ్యతిరేక కార్యక్రమంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సైనిక సాయం పాక్‌కు మరింత ధైర్యాన్ని ఇస్తుందంటూ ఘాటుగా మాట్లాడారు. -
'భారత విద్యార్థులను ఉద్దేశ పూర్వకంగా అవమానించలేదు'
విశాఖపట్నం : యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం పెరిగిందని భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నంలో స్మార్ట్సిటీపై జరిగిన భాగస్వామ్య సదస్సులో రిచర్డ్ ఆర్ వర్మ ప్రసంగించారు. యూఎస్టీడీఏతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. భారత్, యూఎస్‌ల మధ్య సహకారానికి స్మార్ట్‌సిటీతో పునాది పడిందన్నారు. యూఎస్‌లో భారతీయ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా అవమాన పర్చలేదని రిచర్డ్ ఆర్ వర్మ స్పష్టం చేశారు. ప్రవేశాల్లో రెండు అంకెల పద్దతిపై అవగాహన లేకే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. రక్షణ రంగంలో సహకారానికి ఇరు దేశాలు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. జెట్ విమానాల తయారీకి పరస్పర సహకారంతో పనిచేసేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇరు దేశాల వాణిజ్యవ్యాపారాల్లో 500 బిలియన్ డాలర్లు చేసుకోవాలన్నదే లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా ఎగుమతులు, దిగుమతుల్లో భారత్ వాటా 2 శాతం మాత్రమే అని వెల్లడించారు. పౌర అణురంగంలో భారతదేశంతో మరింత సంబంధాలు పెంచుకుంటామన్నారు. -
విద్యార్థులకు జరిగిన దానికి విచారిస్తున్నాం: అమెరికా
భారతీయ విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపేసిన ఘటనపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. పరిస్థితిని తాము జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని.. వాస్తవాలను సేకరిస్తున్నామని భారతదేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. అమెరికాకు వెళ్లే విద్యార్థులు కొన్నాళ్ల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించిన ఒక రోజు తర్వాత అమెరికా నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. కాలిఫోర్నియాలోని రెండు విశ్వవిద్యాలయాలలో చేరేందుకు వెళ్తున్న విద్యార్థులను కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వాళ్లు అడ్డుకుని తిప్పి పంపేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటన వల్ల కొంతమంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులపై పడిన ప్రభావానికి తాము విచారం వ్యక్తం చేస్తున్నామని రిచర్డ్ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. అక్కడి పరిస్థితి మొత్తాన్ని తాము డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీతో సమీక్షిస్తున్నామని, భారత ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. వాస్తవాలను ఇంకా సేకరిస్తున్నట్లు వివరించారు. భారత, అమెరికా విద్యార్థుల మధ్య విద్యా సంబంధ కార్యక్రమాలకు అమెరికా ఎప్పటికీ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుందని, వీటివల్ల కొన్ని దశాబ్దాల పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయని రిచర్డ్ వర్మ అన్నారు. -
‘డిఫెన్స్’ కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు
దక్షిణాది నగరాలను ఎంచుకున్న అమెరికన్ కంపెనీలు భారత్‌లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ వెల్లడి న్యూఢిల్లీ: రక్షణ సహకారంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలను అమెరికన్ కంపెనీలు టెక్నాలజీ సెంటర్లుగా మార్చనున్నాయి. భారత్-అమెరికా భాగస్వామ్యంలో భాగంగా రక్షణ రంగంలో సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణాదిలో కీలకమైన ఈ రెండు నగరాలను అమెరికా ఎంచుకుంది. ప్రధాని మోదీతో అమెరికా దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా చర్చల సందర్భంగా ఇందుకు నాంది పడినట్లు భారత్‌లోని ఆ దేశ రాయబారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వచ్చే శతాబ్ధంలో ఇరు దేశాల బంధం ఎంతో బలపడనుందని, రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యం ఎంతగా పెనవేసుకుంటే అంతటి బలమైన బంధం ఏర్పడిందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చునని రిచర్డ్ వర్మ తెలిపారు. యుద్ధవిమానాల తయారీలోనూ ఇరు దేశాలు కలిసి పాలుపంచుకోవడం గొప్ప ముందడుగని, ఏడాది కిందట ఎవరూ దీన్ని కనీసం ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. రక్షణకు సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీల అభివృద్ధికి అమెరికన్ కంపెనీలు.. హైదరాబాద్, బెంగళూరు నగరాలను కీలక స్థావరాలుగా మలచుకుంటాయని రిచర్డ్ పేర్కొన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మిలటరీ ఒప్పందాలను ఖరారు చేసుకోడానికి ఇరుదేశాలు కృషి చేస్తాయన్నారు. సీఐఎస్ఎంవోఏ, జియోస్పేషియల్ సహకారం, లాజిస్టిక్స్ సహకార ఒప్పందాల విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరులోనూ ఇరు దేశాలు సంయుక్తంగా ముందుకు సాగుతున్నాయన్నారు. భారత్‌లో గాంధీకే దిగ్భ్రమ కలిగించే మత అసహనం: ఒబామా భారతదేశంలో అన్ని రకాల మతవిశ్వాసాలు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న అసహన చర్యలు మహాత్మా గాంధీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇటీవల భారత పర్యటన ముగింపు సందర్భంగా బహిరంగంగా ప్రసంగిస్తూ మత సహనం గురించి ప్రస్తావించటం బీజేపీ లక్ష్యంగానే చేశారనే వాదనను శ్వేతసౌధం బుధవారం ఖండించింది. కానీ, గురువారం వాషింగ్టన్లో జరిగిన ‘నేషనల్ ప్రే యర్ బ్రేక్‌ఫాస్ట్’ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ, ‘‘భారత్‌లో కొంతకాలంగా ఇతర మతవిశ్వాసాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ అసహన చర్యలు.. ఆ జాతిని విముక్తం చేసేందుకు దోహదపడిన గాంధీజీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవి’’ అని పేర్కొన్నారు.