ఇస్లామాబాద్/ముంబై: అమెరికా తమకు ఎఫ్16 యుద్ధ విమానాలను అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం విస్మయం కలిగించిందని పాకిస్తాన్ పేర్కొంది. భారత్ ఒకవైపు పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ మరో వైపు తమ విషయంలో ఇలా స్పందించడం సబబు కాదని వ్యాఖ్యానించింది. భారత్ వద్ద పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రి ఉందని తెలిపింది. ఎఫ్16లతో ఉగ్రవాదంపై పోరులో పాక్ సామర్థ్యం పెరుగుతుందని అమెరికా సర్కారు చేసిన వ్యాఖ్యలను సమర్థించింది.
ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పాక్‌కు విమానాలను విక్రయించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ సమర్థించుకున్నారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల కొనసాగింపులో భాగంగానే ఈ నిర్ణయం జరిగిందని ముంబైలో తెలిపారు. పాత ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.
ఎఫ్16ల కొనుగోలులో భారత్ అభ్యంతరంపై పాక్ విస్మయం
Published Mon, Feb 15 2016 12:48 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM
Advertisement