పాక్‌కు అమెరికా ఎఫ్-16ల అమ్మకం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు అణుసామర్థ్యం గల 8 ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాల్ని అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఒప్పందం విలువ రూ.4670 కోట్లపైనే. ఈ ఒప్పందాన్ని రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా ఒబామా ప్రభుత్వ వెనకడుగు వేయడం లేదు.
భారత్ తీవ్ర అసంతృప్తి.. పాక్‌కు ఎఫ్-16 విమానాలు అమ్మాలన్న అమెరికా నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. చాలా నిరుత్సాహానికి గురయ్యామని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మకు విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ చెప్పారు. రిచర్డ్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చించారు. ఈ చర్యను భారత్ వ్యతిరేక కార్యక్రమంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇలాంటి సైనిక సాయం పాక్‌కు మరింత ధైర్యాన్ని ఇస్తుందంటూ ఘాటుగా మాట్లాడారు.