న్యూఢిల్లీ: అణు సరఫరా దేశాల బృందం (ఎన్‌ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం దక్కకపోవడంతో అమెరికా నిరాశపడిందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. కొద్ది నెలల్లోనే సభ్యత్వం దక్కుతుందని, ఆ అర్హత భారత్‌కు ఉందని అన్నారు. ఇందుకోసం ఎన్‌ఎస్జీ 48 సభ్యదేశాలతో చర్చలు కొనసాగిస్తామన్నారు. భారత్ పట్ల సానుకూలత వచ్చేటట్లు చేస్తామన్నారు. పలు సభ్య దేశాలు నాన్-ఎన్‌పీటీ దేశాల చేరికపై అభ్యంతరాలు చెప్పడం వల్లే భారత్‌కు సభ్యత్వం రాలేదని చైనా పేర్కొంది.
మా వ్యూహంతో అడ్డుకట్ట: పాక్
పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 17 దేశాలకు రాసిన లేఖలతో పాటు పకడ్బందీగా చేసిన వ్యూహాత్మక సంప్రదింపులు భారత్‌కు ఎన్‌ఎస్జీ సభ్యత్వం రాకుండా అడ్డుకోగలిగాయని పాక్ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ చెప్పారు.
ఎన్‌ఎస్జీలో చేరే అర్హత భారత్ కు ఉంది: అమెరికా
Published Tue, Jun 28 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
Advertisement