రష్యాతో పటిష్ట బంధాన్ని కోరుకుంటున్నా: మోడీ | we want good relations with russia, says narendra modi | Sakshi
Sakshi News home page

రష్యాతో పటిష్ట బంధాన్ని కోరుకుంటున్నా: మోడీ

Published Fri, Jun 20 2014 1:34 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

we want good relations with russia, says narendra modi

న్యూఢిల్లీ: రష్యాను విశ్వసనీయ మిత్ర దేశంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. అన్ని కష్టకాలాల్లోనూ భారత్‌కు ఆ దేశం అండగా నిలిచిందని కొనియాడారు. భారత్-రష్యాల మధ్య బంధాన్ని కొత్త శిఖరాలకు చేరాలని అభిలషించారు. ఈ మేరకు గురువారం తనను కలసిన రష్యా ఉప ప్రధాని దిమిత్రీ రోగోజిన్‌కు తన మనసులోని మాట చెప్పారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంపిన సందేశాన్ని మోడీకి రోగోజిన్ తెలియజేశారు. పుతిన్ భారత్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement