'నాన్నకు బుల్లెట్లన్ని దింపి.. మళ్లీ లోడ్ చేశారు' | When 24 bullets were fired at their father: NIA officer's children recount the horror | Sakshi
Sakshi News home page

'నాన్నకు బుల్లెట్లన్ని దింపి.. మళ్లీ లోడ్ చేశారు'

Published Mon, Apr 4 2016 4:01 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

'నాన్నకు బుల్లెట్లన్ని దింపి.. మళ్లీ లోడ్ చేశారు' - Sakshi

'నాన్నకు బుల్లెట్లన్ని దింపి.. మళ్లీ లోడ్ చేశారు'

బిజ్నూర్: పిల్లలముందు చిన్న ఘర్షణలాంటిది జరిగితేనే అది మరిచిపోవడానికి ఎంతో సమయం పడుతుంది. వారి మనసును ఆ ఘటన వేధిస్తుంటుంది. అలాంటిది కన్నతండ్రిపై కళ్లముందే దుండగులు కాల్పులు జరుపుతుంటే.. ఆ సమయంలో వారెంత భయపడిపోతారు.. బుల్లెట్ల ధాటికి తండ్రి రక్తపు బిందువులు చింది వారిపై పడుతుంటే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? సరిగ్గా ఇదే అనుభవాన్ని ఎదురుచూశారు దుండగుల చేతుల్లో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన ఎన్ఐఏ అధికారి మహ్మద్ తాంజిల్ పిల్లలు.

తన కుటుంబంతో కలిసి వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగొస్తున్న తాంజీల్ పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు శనివారం రాత్రి వికృతంగా కాల్పులు జరిపారు. మొత్తం 24 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దిగాయి. ఆయన అక్కడికక్కడే చనిపోగా నాలుగు బుల్లెట్లు ఆయన భార్యకు తగిలాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. బిజ్నూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను సీటు వెనుకాలే కూర్చుని ప్రత్యక్షంగా చూసిన ఆ పిల్లలు ఎంతగా భయపడిపోతున్నారంటే..

'ఆ ఘటన ఇప్పటికీ మా కనురెప్పలు వాలనివ్వడం లేదు. మేం పెళ్లికి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. మా నాన్నను వారి చేతిలోని తుపాకీలో బుల్లెట్లు అయిపోయే వరకు కాల్చారు. అవి అయిపోగానే మరోసారి లోడ్ చేసి కాల్పులు జరిపారు. కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు అక్కడే ఉండి అనంతరం వెళ్లిపోయారు. కాల్పులు ప్రారంభం కాగానే మానాన్న సీటుకింద దాచుకోండని చెప్పాడు' అంటూ ఆ పిల్లలు ఏడుస్తూ చెప్పారు. తాంజిల్కు 14 ఏళ్ల కూతురు, పన్నేండేళ్ల బాబు ఉన్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement