
భువనేశ్వర్: స్థానిక తులసీనగర్‌కు చెందిన కె.ఇంద్రావతి పాత్రో తాను చనిపోయి, తన కళ్లను మరో ఇద్దరు అంధులకు దానం చేసి, ఆదర్శంగా నిలిచింది. ఇంద్రావతి పాత్రో(59) చనిపోయిన విషయం తెలుసుకున్న నగరానికి చెందిన సర్ధార్ వల్లాభాయ్ పటేల్ బహుముఖి సమాజ్ ప్రతినిధులు మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి, నేత్రదానంపై అవగాహన కల్పించారు.
ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు సుముఖుత వ్యక్తం చేయడంతో ఇంద్రావతి మృతదేహాన్ని ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స జరిపి, ఆమె రెండు కళ్లను తొలగించి, మరో ఇద్దరికి అమర్చారు. ఇదే విషయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment