తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది.
కోయంబత్తూర్: తన ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. తొలి ప్రయత్నంలో పాముల ద్వారా కాటు వేయించాలని ప్రయత్నించి అది విఫలం కావడంతో సుఫారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. ఈ ఘటన తమిళనాడులోని పట్టనంపుదూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు కృష్ణ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది.
వారిద్దరు ఎలాగైనా ఆమె భర్తను హత్య చేయాలని అనుకున్నారు. తొలుత భర్త పడగ గదిలోకి పామును విడిచిపెట్టగా అది కాటువేయకుండానే బయటకు వెళ్లిపోయింది. దీంతో ఎల్ సుందర్ అనే వ్యక్తికి హత్య చేసే పని అప్పగించారు. తొలుత 15వేలు చేతికి ఇచ్చి అనంతరం రూ.ఐదు లక్షలుపెట్టి జిమ్ ఏర్పాటుచేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే సుందర్ అనే వ్యక్తి ఆమె భర్త శక్తివేల్ను పెద్దపెద్ద కర్రలతో కొట్టి చంపి ఓ చెత్తకుప్పలో పడేశారు.