కారులో మహిళపై గ్యాంగ్ రేప్ | Woman gang-raped in car on way back from Gurgaon mall | Sakshi
Sakshi News home page

కారులో మహిళపై గ్యాంగ్ రేప్

Published Wed, Feb 24 2016 10:05 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

కారులో మహిళపై గ్యాంగ్ రేప్ - Sakshi

కారులో మహిళపై గ్యాంగ్ రేప్

గుర్గావ్: కారులో మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి  పాల్పడిన దారుణ ఘటన గుర్గావ్ లో చోటుచేసుకుంది. ఎంజీ రోడ్డులోని సహారా మాల్ నుంచి తిరిగి వస్తున్న 26 ఏళ్ల మహిళపై ఆదివారం అర్ధరాత్రి ఈ అఘాయిత్యం జరిగింది. బెవెర్లీ పార్క్-1 ప్రాంతం నుంచి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కారులో ఆమెను ఎత్తుకుపోయి ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

సోమవారం ఉదయం బాధితురాలు వసంత్ విహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు గుర్గావ్ కు బదిలీ చేశారు. బాధితురాలు తన రెండేళ్ల కొడుకుతో కలిసి ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. గుర్గావ్ నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై గ్యాంగ్ జరిగిందని, గుర్తు తెలియని దుండగులపై కేసు నమోదు చేశామని సెక్టార్ 29 పోలీస్ స్టేషన్ ఏసీపీ డీఎల్ఎఫ్ రమేశ్ పాల్ వెల్లడించారు.

ఇంటికి చేరుకునేందుకు ఇఫ్కో చౌక్ వద్ద ఆటో ఎక్కిన ఆమెను బెవెర్లీ పార్క్-1 సమీపంలో తెల్లరంగు కారులో వచ్చిన వ్యక్తులు అడ్డగించి తమతో తీసుకెళ్లారని.. కారులో ముగ్గురు పురుషులతో పాటు మహిళ కూడా ఉందని తెలిపారు. గోల్ఫ్ కోర్సు రోడ్డు వైపుగా తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement