ప్రతీకాత్మక చిత్రం
ఎలాంటి విదేశి ప్రయాణ చరిత్రలేని, కరోనా సోకిన వారితో సంబంధంలేని ఓ మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. ఈ వివరాలను జాతీయ వైరాలజీ సంస్థ శనివారం వెల్లడించింది దీంతో దేశంలో మొదటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ కేసు ఇదే అయి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 258కి చేరగా నలుగురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర వైద్యాధికారి మాట్లాడుతూ.. కరోనా సోకిన మహిళ(41) పూణేలోని సిన్గాడ్ రోడ్డులో నివసిస్తుందని, మొదటి రెండు కేసులు ఆ ప్రాంతంలోనే నమోదయ్యాయని తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటి వరకు 50 కేసులు నమోదు అయితే అందులో 23 పూణేలోనే వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. (కరోనా అలర్ట్ : ఆ రాష్ట్రంలో 65 కేసులు)
జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ రామ్ మాట్లాడుతూ.. ఈ మహిళ భారతి ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదని, అయితే ఆమె ఈ నెల 3న నవీ ముంబైలోని వసిలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆమె విదేశాలకు వెళ్లివచ్చినవారిని కలిసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసును ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ మహిళను ఈ నెల 16న తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. శుక్రవారం నుంచి ఆమెకు వెంటిలేటర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (శానిటైజర్ వేసి సీట్లను తుడిచిన స్టార్ నటి!)
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారత్‌లో కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లోకి ఇంకా ప్రవేశించలేదు. దేశంలో కరోనా వ్యాప్తిని ఆపడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని ఆదివారం జనతా కర్ప్యూకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. (జనతా కర్ఫ్యూ : ఏపీలో బస్సులు బంద్!)
Comments
Please login to add a commentAdd a comment