National Institute of Virology
-
Warning: తెలంగాణలో జికా వైరస్ కలకలం
దేశంలో కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ప్రజలను జికా వైరస్ టెన్షన్‌కు గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో జికా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) హెచ్చరించింది. ఐసీఎంఆర్, నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన అధ్యయనంలో.. జికా వైరస్ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాలకు వ్యాపించిందని పేర్కొంది. ఈ అధ్యయనం ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ఇటీవలే ప్రచురించబడింది. వీరి అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చెప్పింది. ఇక, ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో జికా వైరస్ ఉనికిని కనుగొన్నట్టుగా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జీకా వైరస్ నిర్ధారణ అయినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కూడా ఈ కేసులు నమోదైనట్టు సమాచారం. మరోవైపు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్, ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ బీఆర్ శమ్మన్నా స్పందించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు జీకా వైరస్‌ను గుర్తించడంపై దృష్టిపెట్టడం మొదలుపెట్టారని అధ్యయనంలో తేలిందని అన్నారు. జికా వైరస్‌పై అవగాహన పెరుగుతోందని చెప్పారు. ఇంతకు ముందు జికా వైరస్ గురించి అంతగా పట్టించుకోలేదన్నారు. ఇక, జీకా వైరస్ దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్ కారణంగా జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. కాగా, డెంగ్యూలాగే ఈ వైరస్ కూడా చాలా ప్రమాదకరని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. #ZikaVirus has spread to various Indian cities including #Hyderabad. It was disclosed by a study conducted by #ICMR and NIV, #Pune. #News #NewsAlert #NewsUpdate #India #Update #Healthcare pic.twitter.com/rDp9D2i6K1 — First India (@thefirstindia) July 6, 2022 ఇది కూడా చదవండి: అమ్మో.. కోనోకార్పస్!.. దడ పుట్టిస్తున్న మడజాతి మొక్కలు -
మళ్లీ వణికిస్తున్న నిఫా...
మన దేశంలో మొదటిసారి 2001 ప్రాంతాల్లో బెంగాల్‌లోని సిలిగురిలో ‘నిపా’ వెలుగు చూసింది. కానీ దానికి అప్పుడంత ప్రాచుర్యం లభించలేదు. మళ్లీ ఆ తర్వాత 2007లో కేరళలో కనిపించిన నిపా... ఇప్పుడు తాజాగా మరోసారి అక్కడ వ్యాపిస్తోంది. వారం కిందట అక్కడి ఓ చిన్నారిని కబళించింది. ఓ వైపు కరోనా.. మరో వైపు నిపా అక్కడ విలయం సృష్టిస్తున్నాయి. కరోనా సోకితే మరణావకాశాలు కేవలం 2% నుంచి 5% శాతమే. కానీ నిపాతో అది 40% –70%. అయితే కరోనా కంటే దాని వ్యాప్తి ఒకింత తక్కువగా కనిపిస్తున్నందున అంతగా ఆందోళన అక్కర్లేదు. కానీ అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి. నిర్ధారణ: ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (పుణే)లో నిర్వహించే అలైజా పరీక్ష ద్వారా దీని నిర్ధారణ చేస్తున్నారు. లక్షణాలు నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగించి, మెదడువాపునకు (ఎన్సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే... 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24 – 48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు. ఇది సోకినవారిలో... అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లోలాగానే... జ్వరం, ఒళ్లునొప్పులు, వికారం, వాంతులు కనిపించవచ్చు. దేహంలో దీర్ఘకాలికంగా వైరస్ ఉంటే మూర్ఛ (కన్వల్షన్స్), ప్రవర్తనలో మార్పులు (పర్సనాలిటీ ఛేంజెస్) కనిపించవచ్చు. మెడ బిగుసుకుపోవడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. ఇక కొందరిలో అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్)లోలా ఊపిరి అందకపోవచ్చు. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వచ్చేలా ‘మయోకార్డయిటిస్’కు దారితీయవచ్చు. అరుదుగా కొందరిలో లక్షణాలేవీ కనిపించకుండానే అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఇది అరుదు. నిపా వైరస్‌ను సంక్షిప్తంగా ‘ఎన్ఐవీ’ అంటుంటారు. ఇదో రకం ‘ఆర్ఎన్ఏ వైరస్’. మలేషియాలోని ‘కాంపంగ్ షుంగై నిపా’ అనేచోట 1998లో వ్యాపించడంతో ఆ ప్రదేశం పేరిట దీన్ని ‘నిపా’ అంటున్నారు. ఆరేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో కనిపించింది. అప్పట్నుంచి ఇది అప్పుడప్పుడూ భారత్, బంగ్లాదేశ్‌లో కనిపించడం మొదలుపెట్టింది. మన దేశంలోని కేరళలో 2018 మే నెలలో ఒకసారి... ఆ తర్వాత మళ్లీ తాజాగా ఇప్పుడూ అక్కడే కనిపిస్తూ బెంబేలెత్తిస్తోంది. వ్యాప్తి ఇలా... ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్. తాటి జాతికి చెంది డేట్‌పామ్ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్ బ్యాట్స్) తో ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. ‘నిపా’ ఫ్రూట్ బ్యాట్ రకానికి చెందిన గబ్బిలాల నుంచి, పందుల నుంచి, అలాగే... ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తుల నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. ఇక నిపా సోకిన వ్యక్తులు పీల్చి వదిలే గాలి (ఏరోసాల్స్) వల్ల కాకుండా... వారి నుంచి వచ్చే తుంపర్లు (డ్రాప్లెట్స్) వల్లనే దీని వ్యాప్తి జరుగుతుందని గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనం ధరించే మాస్కులతో దీని నివారణ కూడా జరుగుతుంది కాబట్టి... మాస్క్ అదనపు / రెట్టింపు ప్రయోజనాలను ఇస్తోందని గ్రహించి, వాటిని తప్పనిసరిగా ధరించడం మంచిది. -
మరో కొత్త వేరియంట్.. వాటితో పోలిస్తే మహా డేంజర్..!
సాక్షి, పుణె: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ మ్యుటేషన్ చెందడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ముఖ్యకారణమని పరిశోధకులు తెలిపారు. డెల్టా వేరియంట్‌గా పిలవబడే B.1.617.2 వేరియంట్ భారత్‌లో అత్యధిక ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా ప్రస్తుతం భారత్‌లో మరో కరోనా వైరస్ వేరియంట్‌ను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) గుర్తించారు. ఈ వేరియంట్‌ను అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల నుంచి B.1.1.28.2 వేరియంట్‌గా గుర్తించారు. ఎన్ఐవి నివేదిక ప్రకారం, బ్రెజిల్, యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేరియంట్‌తో వైరస్ వ్యాప్తి మరింత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్ ప్రస్తుతం ఉన్న టీకాలు ఎంతమేరకు సామర్థ్యాన్ని కల్టి ఉన్నాయనే విషయం కోసం , ఎక్కువగా పరీక్షించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కొత్త వేరియంట్‌ను ప్రయోగించిన ఎలుకల్లో శరీర బరువు ఒక్క సారిగా తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా శ్వాసకోశంలో సమస్యలు, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడాయని పేర్కొన్నారు. కాగా, పది ప్రయోగశాలల సమూహమైన ఇన్సాకాగ్ (INSACOG) విస్తృత అధ్యయనం ప్రకారం, గత రెండు నెలల్లో భారత్‌లో కోవిడ్ -19 కేసుల పెరుగుదల SARS-CoV-2 కు చెందిన B.1.617 వేరియంట్ కారణమని తెలిపారు. ఇన్సకాగ్ ప్రకారం కరోనా వైరస్ B.1.1.7 వేరియంట్‌కు 'ఆల్ఫా' అని పేరు పెట్టారు. దీనిని మొదటిసారిగా యునైటెడ్ కింగ్ డమ్‌లో గుర్తించారు. ఈ వేరియంట్ గత ఒకటిన్నర నెలల్లో తీవ్రస్థాయిలో విజృంభించిందని ఇన్సాకాగ్ తెలిపింది. -
కరోనా కిట్ల కాంట్రాక్ట్‌లో మతలబు ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన బాధితుల్లో యాంటీ బాడీస్‌ను గుర్తించేందుకు ‘ఎలిసా కిట్’ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలాజీ’ ప్రభుత్వ లాబరేటరీ అభివద్ధి చేసింది. ఈ విషయాన్ని ఆదివారం నాడు ఐసీఎంఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించింది. కమర్షియల్‌గా భారీ ఎత్తున ఎలిసా కిట్ల ఉత్పత్తిని అహ్మదాబాద్‌లోని ‘జైడస్ కడీలా’ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి అప్పగించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీనికి భారత్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ లైసెన్స్ మంజూరు చేసినట్లు పేర్కొంది. (విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా..) ఎలిసా కిట్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి పత్రికా ప్రకటనలు చేయకుండా, కనీసం బిడ్డింగ్‌లను కూడా పిలువకుండా ఏకపక్షంగా ఉత్పత్తి ఉత్తర్వులు ఏమిటని దేశంలోని ఇతర ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకు చైనా నుంచి కనీసం దిగుమతి లైసెన్స్ కూడా లేకండా కరోనా కిట్ల సరఫరాకు 30 కోట్ల కాంట్రాక్ట్‌ను ఢిల్లీకి చెందిన ఓ చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీకి బిడ్డింగ్ లేకుండా ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 12 కోట్ల రూపాయల నష్టం వచ్చిన విషయాన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలు గుర్తు చేస్తున్నాయి. నాడు ‘ఆర్క్ ఫార్మాస్యూటికల్స్’ కంపెనీకి ఎలాంటి బిడ్డింగ్ లేకుండా ఆర్డర్ ఇవ్వడం వల్ల, ఆ కంపెనీకి విదేశాల నుంచి మందులు దిగుమతి చేసుకునే లైసెన్స్ లేక పోవడం వల్ల మరో రెండు ఫార్మాస్యూటికల్ కంపెనీలతో లోపాయికారి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. (ఒక్కరోజులో 3,525 కేసులు) ఫలితంగా 245 రూపాయలకు రావాల్సిన కరోనా పరీక్షల కిట్ ప్రభుత్వానికి 600 రూపాయలకు పడింది. ఎలిసా కిట్ల తయారీని కాంట్రాక్ట్‌ను ఏ ప్రాతిపదికన ‘జైడస్ కడిలా’ కంపెనీకి ఇచ్చారని సోమవారం విలేకరులు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌ను ప్రశ్నించగా, రెండు ప్రాతిపదికలపై ఇచ్చినట్లు చెప్పారు. ‘ప్రథమ ప్రాధాన్యత, త్వరతగతి ఉత్పత్తి’ అంశాల ప్రాతిపదికన అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రాతిపదికలు మిగతా కంపెనీలకు ఉండవని ప్రభుత్వాధికారులు ఓ అభిప్రాయానికి ఎలా వచ్చారన్నది శేష ప్రశ్న. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!) -
టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు
న్యూఢిల్లీ: కోవిడ్‌కు దేశీయంగానే టీకా రూపొందించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్)తో జట్టు కట్టింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ), పుణే పరిశోధనశాలలో వేరు చేయబడిన కరోనా వైరస్‌ను ఉపయోగించి ఈ వ్యాక్సిన్ తయారుచేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం. ఎన్ఐవీ నుంచి హైదరాబాద్‌లోని బీబీఐఎల్‌కు ఈ వైరస్‌ను తరలించాం. టీకా తయారీ, అభివృద్ధి, జంతువులు, మనుషులపై ప్రయోగాలు చేపట్టడం, విశ్లేషించడంలో బీబీఐఎల్–ఎన్ఐవీ పరస్పరం సహకరించుకుంటాయి’ అని ఐసీఎంఆర్ తెలిపింది. -
మహమ్మారి తొలి ఫొటోలు విడుదల
ముంబై: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)కు సంబంధించిన ఫొటోలు భారత్‌లో తొలిసారిగా విడుదలయ్యాయి. ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి పుణెలోని ఐసీఎమ్ఆర్-ఎన్ఐవీ శాస్త్రవేత్తలు కంటికి కనిపించని సూక్ష్మజీవి ఫొటోలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. జనవరి 30న భారత్‌లో నమోదైన తొలి కరోనా కేసుకు సంబంధించిన థ్రోట్ స్వాబ్(గొంతుకు సోకిన ఇన్ఫెక్షన్ను గుర్తించేందుకు ఉపయోగించే వైద్య పరీక్ష) నుంచి వీటిని సంగ్రహించినట్లు తెలిపారు. కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన సాంపిల్స్‌లోని జన్యుక్రమం... చైనాలోని వుహాన్‌లో బయటపడ్డ సార్స్-కోవ్-2(కరోనా వైరస్) జన్యుక్రమంతో 99.98 శాతం సరిపోలిందని ఈ సందర్భంగా వెల్లడించారు.(కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ) ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో పొందుపరిచారు. ఐసీఎమ్ఆర్-ఎన్ఐవీ నేషనల్ ఇన్‌ఫ్లూయెంజా సెంటర్ టీం‘‘ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపి ఇమేజింగ్ ఆఫ్ సార్స్-కోవ్-2’’పేరిట ఈ ఆర్టికల్‌ను ప్రచురించింది. భారత్‌లో కరోనా వైరస్ ఫొటోలను తొలిసారిగా తామే విడుదల చేసినట్లు పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా శ్వాసకోశ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితి సంభవిస్తుందని పేర్కొంది. కాగా నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్(ఎన్జీఎస్) ప్రక్రియ ద్వారా తొలిసారిగా ఈ మహమ్మారిని గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్‌కు సంబంధించిన కచ్చితమైన పరిణామక్రమం, మార్ఫాలజీ(ఆకృతి) గురించి ఇంతవరకు ఏ పరిశోధనల్లోనూ పూర్తి వివరాలు వెల్లడికాలేదు.(మహమ్మారి కోరల్లో 724 మంది) -
ఇక సులువుగా ‘కరోనా’ నిర్ధారణ!
న్యూఢిల్లీ : దేశంలో ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే 18 రకాల పరీక్షల కిట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో మూడు రకాల కిట్లను పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ వైరాలజి’ తయారు చేయగా, మిగతా 15 కిట్లకు ఇతర దేశాలు ఇచ్చిన లైసెన్సులు, సర్టిఫికెట్ల ఆధారంగా భారత్ ప్రభుత్వం సత్వర అనుమతి మంజూరు చేసింది. ఈ 18 రకాల కిట్ల తయారీకి, మార్కెటింగ్‌కు అనుమతి మంజూరు చేసినట్లు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమని మీడియాకు తెలియజేశారు. ఇంతవరకు ఇలాంటి కిట్లు చాలినన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కేవలం 26 వేల మందికి మాత్రమే కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగలిగారు. అందుకే వీటికి కేంద్రం సత్వర అనుమతిని మంజూరు చేయాల్సి వచ్చింది. 18 కిట్లలో 15 కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కూడా కేంద్రం అనుమతించినట్లు వీజీ సోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (చదవండి: కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!) కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోకి వచ్చే భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పర్యవేక్షణలోనే దేశంలో ఇంతవరకు కరోనా నిర్ధారిత పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు. వాటిని కూడా తొలుత పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరిమితం చేయడం తీవ్ర జాప్యానికి దారితీసింది. అంతవరకు ప్రభుత్వం అనుమతించిన కరోనా పరీక్షలను పుణే సంస్థనే నిర్వహించాల్సి రావడం ఆలస్యానికి కారణమైంది. ఈ దశలో ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ రంగంలోకి దిగడంతో లైసెన్స్‌ల ప్రక్రియ వేగవంతం అయింది. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్ సీఈ సర్టిఫికెట్ ఉన్నట్లయితే తమ దేశంలో ఈ కిట్ల తయారీకి వెంటనే అనుమతి ఇస్తామని, ఇప్పటి వరకు అలాగే ఇచ్చామని వీజీ సోమని తెలిపారు. నిబంధనల ప్రకారం కనీసం 200 మందిపై పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు పొందాల్సిన విదేశీ కంపెనీలు కేవలం 30 మందిపైనే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు పొందాయని, వాటి ప్రామాణికతను శంకించాల్సి వస్తుందని భారతీయ వైద్యులు అభిప్రాయపడ్డారు. (కరోనా: 300 మందిని బలిగొన్న విష ప్రచారం) -
విదేశీ ప్రయాణ చరిత్ర లేని మహిళకు కరోనా..
ఎలాంటి విదేశి ప్రయాణ చరిత్రలేని, కరోనా సోకిన వారితో సంబంధంలేని ఓ మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. ఈ వివరాలను జాతీయ వైరాలజీ సంస్థ శనివారం వెల్లడించింది దీంతో దేశంలో మొదటి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కేసు ఇదే అయి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 258కి చేరగా నలుగురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర వైద్యాధికారి మాట్లాడుతూ.. కరోనా సోకిన మహిళ(41) పూణేలోని సిన్గాడ్ రోడ్డులో నివసిస్తుందని, మొదటి రెండు కేసులు ఆ ప్రాంతంలోనే నమోదయ్యాయని తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటి వరకు 50 కేసులు నమోదు అయితే అందులో 23 పూణేలోనే వెల్లడయ్యాయని ఆయన తెలిపారు. (కరోనా అలర్ట్ : ఆ రాష్ట్రంలో 65 కేసులు) జిల్లా కలెక్టర్ నావల్ కిశోర్ రామ్ మాట్లాడుతూ.. ఈ మహిళ భారతి ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదని, అయితే ఆమె ఈ నెల 3న నవీ ముంబైలోని వసిలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆమె విదేశాలకు వెళ్లివచ్చినవారిని కలిసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసును ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్ మహిళను ఈ నెల 16న తమ ఆసుపత్రికి తీసుకొచ్చారన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. శుక్రవారం నుంచి ఆమెకు వెంటిలేటర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. (శానిటైజర్ వేసి సీట్లను తుడిచిన స్టార్ నటి!) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారత్‌లో కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్లోకి ఇంకా ప్రవేశించలేదు. దేశంలో కరోనా వ్యాప్తిని ఆపడానికి కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రధాని ఆదివారం జనతా కర్ప్యూకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. (జనతా కర్ఫ్యూ : ఏపీలో బస్సులు బంద్!) -
విమానంలో చైనా వ్యక్తి వాంతులు..
ముంబై : చైనా నుంచి ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ఆయా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారతీయులకు కూడా వ్యాప్తి చెందుతోందని ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి పుణె వెళ్లున్నఎయిర్ ఇండియా విమానంలో చైనాకు చెందిన వ్యక్తి(31) రెండు సార్లు వాంతులు చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది పూణె విమానశ్రయానికి చేరుకోగానే. మున్సిపల్ కార్పొరేషన్ నాయుడు ఆస్పత్రికి తరలించి అక్కడ ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అతని నమూనాలు సేకరించి వాటిని పూణెలోని జాతీయ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు(ఎన్ఐవీ) పంపారు. (కరోనా భయం; వీడియో కాల్లో ఆశీర్వాదాలు) కాగా చైనా వ్యక్తికి ఇప్పటికే దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని, వాటి నమూనాలు ఎన్ఐవీకి పంపామని, పూర్తి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని వైద్యులు తెలిపారు. అదే విధంగా పూణెలో విమానాన్ని శుభ్రపరిచి తిరిగి విమానం ఢిల్లీ చేరేందుకు నాలుగు గంటలు ఆలస్యమెందని పూణే విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇక చైనాలోని వుహాన్‌లో మొదటగా గుర్తించిన కరోనా భారత్‌తో సహా 25 దేశాలకు వ్యాప్తి చెందింది. కేరళలలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. (కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ) -
కేరళలో నిఫా కలకలం!
తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కొచిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి నిఫా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. విద్యార్ధికి సంబంధించిన రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, కాలమస్సరి వైద్యకళాశాల ఆస్పత్రివర్గాలు ఆ విద్యార్థికి ప్రత్యేకవార్డు కేటాయించాయని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఎర్నాకుళంకు చెందిన సదరు విద్యార్థి ఇటీవల క్యాంపు నిమిత్తం త్రిశూర్‌కు వెళ్లాడని, ఆ సందర్భంగా అతడికి జ్వరం సోకడంతో ఆసుపత్రిలో చేరాడని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రీనా తెలిపారు. ఆ క్యాంపులో 16 మంది విద్యార్థులు ఉన్నారని, అతడితో సన్నిహితంగా ఉన్న ఆరుగురు విద్యార్థులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఏవైనా అనుమానిత కేసులు వస్తే వెంటనే తెలియజేయాలని ప్రైవేట్ ఆసుపత్రులను మంత్రి ఆదేశించారు. కేరళలో గత ఏడాది మే నెలలో నిఫా వైరస్ సోకి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
8 నెలల్లో 1094 మందిని బలి తీసుకుంది
సాక్షి, న్యూఢిల్లీ : స్వైన్‌ఫ్లూ కలకలం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా గడిచిన ఎనిమిది నెలల్లో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1094కు చేరింది. వీరిలో గత మూడు వారాల్లోనే స్వైన్‌ఫ్లూతో బాధపడతూ 342 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా డేటా ప్రకారం స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారిలో మహారాష్ట్ర, గుజరాత్ వాసులు అత్యధికంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూతో వరుసగా 437, 269 మరణాలు సంభవించాయి. రాజస్థాన్, కేరళ, ఢిల్లీలోనూ స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేసింది. గతం కంటే ఈ ఏడాది వ్యాప్తి చెందిన హెచ్1ఎన్1 భిన్నమైనదని ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ ఏసీ ధరీవాల్ పేర్కొన్నారు. దీని కారణంగానే స్వైన్‌ఫ్లూ వ్యాప్తి, మరణాలు ఈసారి అధికంగా ఉన్నాయని చెప్పారు. పూణేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైతం ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేసింది. స్వైన్‌ఫ్లూ సోకిన డయాబెటిస్, ఆస్త్మా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే మధ్యవయస్కులు జాగ్రత్తగా ఉండాలని వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ జగదీష్ ప్రసాద్ సూచించారు.