![Chinese National Vomits on Pune Flight Sent To Hospital To Test For Coronavirus - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/7/corona_1.jpg.webp?itok=YlUfbrjU)
ఫైల్ ఫోటో
ముంబై : చైనా నుంచి ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన కరోనా మహమ్మారి ఆయా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా భారతీయులకు కూడా వ్యాప్తి చెందుతోందని ప్రజలకు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి పుణె వెళ్లున్నఎయిర్ ఇండియా విమానంలో చైనాకు చెందిన వ్యక్తి(31) రెండు సార్లు వాంతులు చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది పూణె విమానశ్రయానికి చేరుకోగానే. మున్సిపల్ కార్పొరేషన్ నాయుడు ఆస్పత్రికి తరలించి అక్కడ ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి అతని నమూనాలు సేకరించి వాటిని పూణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు(ఎన్‌ఐవీ) పంపారు. (కరోనా భయం; వీడియో కాల్‌లో ఆశీర్వాదాలు)
కాగా చైనా వ్యక్తికి ఇప్పటికే దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నాయని, వాటి నమూనాలు ఎన్‌ఐవీకి పంపామని, పూర్తి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని వైద్యులు తెలిపారు. అదే విధంగా పూణెలో విమానాన్ని శుభ్రపరిచి తిరిగి విమానం ఢిల్లీ చేరేందుకు నాలుగు గంటలు ఆలస్యమెందని పూణే విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇక చైనాలోని వుహాన్‌లో మొదటగా గుర్తించిన కరోనా భారత్‌తో సహా 25 దేశాలకు వ్యాప్తి చెందింది. కేరళలలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. (కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ)
Comments
Please login to add a commentAdd a comment