పాట్నా: పెళ్లి చూపులకు వచ్చిన వారితో.. మీ ఇంట్లో టాయిలెట్ ఉందా అంటూ ఆడపిల్ల వారు ప్రశ్నిస్తారు. మరుగు దొడ్ల ప్రాధాన్యం గురించి చెప్పేందుకు రూపొందించిన ప్రకటన ఇది. బీహార్లో మరుగుదొడ్డి కట్టించలేదంటూ ఓ యువతి ఏకంగా భర్త నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది.
పాట్నా జిల్లా సదేషొపుర్ గ్రామానికి చెందిన అలఖ్ నిరంజన్ ఇటీవల పెళ్లిచేసుకున్నాడు. ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సిరావడంతో నిరంజన్ భార్య అసౌకర్యానికి గురైంది. ఇంట్లో టాయిలెట్ కట్టించాల్సిందిగా భర్తను పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. పైగా ఆమెపై నిరంజన్ చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన నిరంజన్ భార్య తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా హెల్ప్లైన్ ద్వారా కోర్టును ఆశ్రయించింది. 'పెళ్లి చేసుకున్న కొత్తలో టాయిలెట్ కట్టిస్తానని నా భర్త చెప్పాడు. నేటికి ఈ వసతి ఏర్పాటు చేయలేదు. పైగా నాపై చేయిచేసుకున్నాడు. ఆ ఇంట్లో నా భర్తతో కలసి జీవించే ప్రసక్తే లేదు. అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా' అని నిరంజన్ భార్య చెప్పింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.
టాయిలెట్ కట్టించలేదంటూ విడాకులు కోరిన భార్య
Published Sat, May 3 2014 3:22 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement