న్యూఢిల్లీ: భారతదేశంలో మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోందని.. ఇది ఆందోళనకరమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తెలిపింది. పురుషులతో పోలిస్తే.. మహిళాకార్మికుల సంఖ్యలో తేడా చాలా తక్కుగా ఉందని ఐఎల్‌వో డెరైక్టర్ జనరల్ గై రైడర్ తెలిపారు.
కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశం తర్వాత రైడర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తోపాటు పలు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేసినపుడే.. ఈ దేశ జీడీపీ వృద్ధి చెందుతుందని.. గతేడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో స్త్రీ, పురుష కార్మికుల సంఖ్యలో 12 శాతం తేడా ఉండగా.. భారత్‌లో ఇది 50 శాతంగా ఉంది.
భారత్‌లో తగ్గుతున్న మహిళా కార్మికులు
Published Fri, Jul 8 2016 8:05 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM
Advertisement