labour market
-
కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్. లక్షల ఉద్యోగాలు భర్తీకి కెనడా రారమ్మని ఆహ్వానిస్తోంది. కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత పెరగొచ్చని తాజా సర్వే వెల్లడించింది. దేశంలో పెద్దవాళ్లు ఎక్కువగా ఉండటం, ఎక్కువమంది రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నకారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో శాశ్వత నివాసితులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. సో..కెనడాకు ఎగిరిపోయి అక్కడే స్థిరపడేలా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పొందాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. (చదవండి: Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) మే 2022 నాటి లేబర్ ఫోర్స్ సర్వే అనేక పరిశ్రమలలో పెరుగుతున్న కార్మికుల కొరతను హైలైట్ చేసింది. 2021, మే నుండి ఖాళీల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగిందని తెలిపింది. వృత్తిపరమైన, శాస్త్రీయ , సాంకేతిక సేవలు, రవాణా , గిడ్డంగులు, ఫైనాన్స్ , భీమా, వినోదం, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ రంగంలోనూ రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. వలసదారులు ఓపెన్ స్థానాలకు పర్మినెంట్ వీసాలకు డిమాండ్ పెరగనుందని వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే ఇప్పుడు మరిన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయని మరో సర్వే తెలిపింది. (CSIR: టాప్ సైంటిఫిక్ బాడీకి తొలి మహిళా హెడ్‌గా కలైసెల్వి రికార్డు) అల్బెర్టా , అంటారియోలో, ఏప్రిల్‌లో ప్రతి ఓపెన్ పొజిషన్‌కు 1.1రేషియోలో నిరుద్యోగులు ఉన్నారు,ఈ నిష్పత్తి అంతకు ముందు సంవత్సరం 1.2 పోలిస్తే, ఈ మార్చికి 2.4 కు పెరిగింది. న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్లో ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి, దాదాపు నలుగురు నిరుద్యోగులు ఉన్నారు. నిర్మాణ పరిశ్రమలో ఖాళీలు కూడా ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 89,900కి చేరుకున్నాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 45 శాతం,మార్చి నుండి 5.4 శాతం పెరిగాయి. నోవా స్కోటియా, మానిటోబా రెండింటిలోనూ లాడ్జింగ్ , ఫుడ్ సర్వీసెస్ సెక్టార్లో 1,61 లక్షల ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. అలాగే వసతి, ఆహార సేవలు వరుసగా 13వ నెలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలుండటం విశేషం.2022లోకెనడా రికార్డు స్థాయిలో 431,645 కొత్త శాశ్వత నివాసితులకు తలుపులు తెరవనుంది. 2022 మొదటి అర్ధభాగంలోనే, కెనడా ఇప్పటికే దాదాపు 2 లక్షలమందికి పర్మినెంట్ రెసిడెన్సీలుగా అవకాశం ఇచ్చింది. 2024 నాటికి 4.5 లక్షల టార్గెట్‌గా పెట్టుకుందని నివేదిక పేర్కొంది. తక్కువ మంది వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడంతోపాటు, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు ముందుగానే రిటైర్ అవుతున్నారట. దీంతో కెనడా లేబర్ మార్కెట్ ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ఇటీవలి ఆర్బీసీ సర్వే ప్రకారం, కెనడియన్లలో మూడింట ఒక వంతు మంది ముందుగానే పదవీ విరమణ చేస్తున్నారు . పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 10 మందిలో ముగ్గురు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా రిటైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే కెనడాలో 2020లో, సంతానోత్పత్తి రేటు 1.4 రేషియోలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఇదీ చదవండి : మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? -
కరోనా: గతం కంటే ఘోరం..
జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) మంగళవారం పేర్కొంది. 2020 సంవత్సరం ద్వితీయార్థం ప్రపంచ కార్మిక మార్కెట్లో తీవ్ర అనిశ్చితి తప్పదని తాజా నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా కోల్పోయిన ఉద్యోగాల స్థాయిని వైరస్ వ్యాప్తికి ముందు ఉన్న స్థితికి ఈ సంవత్సరంలో తీసుకు రాలేమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల పని గంటలు, వేతనాలు తగ్గుతాయని ఐఎల్ఓ హెచ్చరించింది.(లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులు) కరోనా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చడంతో కార్మిక మార్కెట్లకు జరిగిన నష్టం అంచనాలను గతం కంటే గణనీయంగా పెంచామని ప్రపంచ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి ఇప్పట్లో కోలుకోలేమన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయన్నారు. ఇప్పటికీ 93 శాతం మంది కార్మికులు పని ప్రదేశాలు మూసివేసిన దేశాల్లోనే నివసిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం మహిళా కార్మికులపై అధికంగా ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు, ఆర్థిక సంక్షోభం.. ఇది ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. వైరస్ నేపథ్యంలో నిరుద్యోగాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచం కూడా సిద్ధంగా ఉండాలని, ఈ పరిస్థితులను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఐఎల్ఓ పేర్కొంది. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) ప్రపంచ పని గంటలు తగ్గడంతో గతంలో అంచనా వేసిన దానికంటే ఈ సంవత్సరం మొదటి భాగంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఐఎల్ఓ తన తాజా నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం ప్రభావం అమెరికాపై అత్యధికంగా ఉందని, అగ్రరాజ్యం దాదాపు 18.3 శాతం పని గంటలను కోల్పోయిందని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో 14 శాతం పని గంటలు వృధా అయ్యాయని, ఇది 40 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమని అంచనా వేసినట్లు ఐఎల్ఓ తెలిపింది. ఈ నష్టాలు నాల్గవ త్రైమాసికంలోనూ కొనసాగి దాదాపు 14 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమైన 4.9 శాతం పని గంటలు కోల్పోయే అవకాశముందని అంచనా వేసింది. మహమ్మారి రెండో దశగా పరిగణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఖ్య 11.9 శాతం లేదా 340 మిలియన్ ఉద్యోగాలకు పెరగవచ్చని తెలిపింది. (కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక) -
భారత్‌లో తగ్గుతున్న మహిళా కార్మికులు
న్యూఢిల్లీ: భారతదేశంలో మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోందని.. ఇది ఆందోళనకరమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తెలిపింది. పురుషులతో పోలిస్తే.. మహిళాకార్మికుల సంఖ్యలో తేడా చాలా తక్కుగా ఉందని ఐఎల్వో డెరైక్టర్ జనరల్ గై రైడర్ తెలిపారు. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశం తర్వాత రైడర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌తోపాటు పలు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. భారతదేశంలో పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేసినపుడే.. ఈ దేశ జీడీపీ వృద్ధి చెందుతుందని.. గతేడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో స్త్రీ, పురుష కార్మికుల సంఖ్యలో 12 శాతం తేడా ఉండగా.. భారత్‌లో ఇది 50 శాతంగా ఉంది. -
స్విట్జర్లాండ్‌లో మినీ ప్రపంచం!
దావోస్: పర్యాటకుల స్వర్గధామమైన స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరం ఒక మినీ ప్రపంచంలా మారిపోనుంది. ఏంటి వింతగా ఉందా? ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం ఇక్కడికి వస్తున్న దేశాధినేతలు, ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు, కంపెనీల సీఈఓలతో దావోస్ చిన్నసైజు ప్రపంచాన్ని తలపించబోతోంది. చుట్టూ మంచుతో స్కీయింగ్ రిసార్ట్‌గా పేర్కొందిన ఈ నగరంలో 43వ వార్షిక డబ్ల్యూఈఎఫ్ సదస్సు నేటి నుంచి 5 రోజుల పాటు జరగనుంది. దీనికి భారత్ నుంచి కేంద్ర మంత్రులు, అనేక కంపెనీల అధినేతలు సహా మొత్తం 125 మంది భారీ ప్రతినిధుల బృందం హాజరవుతోంది. మంగళవారం సాయంత్రం ఈ సదస్సును డబ్ల్యూఈఎఫ్ చైర్మన్ క్లాస్ స్క్వాబ్ అధికారికంగా ప్రారంభిస్తారు. 22-25 వరకూ చర్చలు, సంప్రదింపుల సెషన్స్ జరుగుతాయి. ఇవీ వివరాలు... సదస్సు ఎక్కడ: స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ఇది ఎన్నోసారి: ఇక్కడ 43వ సారి జరుగుతోంది ఎప్పటిదాకా: ఈ నెల 21 నుంచి 25 వరకూ(5 రోజులు) ఎంతమంది వస్తున్నారు: మొత్తం 2,500 మంది. వీరిలో 1,500 మంది వ్యాపార ప్రతినిధులే. ఈ ఏడాది థీమ్: మారుతున్న ప్రపంచం: సమాజం, రాజకీయాలు, వ్యాపారంపై దీని ప్రభావం ఎవరెవరు ఉంటారు: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల ప్రతినిధులు. ఇందులో 40 దేశాల అధిపతులు, నాయకులు, కార్పొరేట్ వర్గాలు ప్రధానంగా ఉంటారు. ఆతిథ్య స్విట్జర్లాండ్ సహా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, కొరియా, భారత్ తదితర దేశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, జపాన్ ప్రధాని షింజో అబే, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సహా పలువురు జీ-20 కూటమి దేశాధినేతలు సైతం ప్రసంగించనున్నారు. వందలకొద్దీ టాప్ కంపెనీల సీఈఓలు. పేరొందిన అపర కుబేరులు కూడా రానున్నారు. సదస్సులో ఏం చేస్తారు: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులపై చర్చ. దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంప్రదింపులు, వాణిజ్య అంశాలూ ఇందులో ప్రధానంగా ఉంటాయి. యూరోజోన్‌లో సంక్షోభం నేపథ్యంలో దీని భవిష్యత్తుపైనా దృష్టిసారించే అవకాశం. అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు కూడా: ఐక్యరాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) డెరైక్టర్ జనరల్ రోబర్టో అజెవెడో తదితరులు కొలువుదీరనున్నారు. అంతర్జాతీయ కంపెనీల క్యూ: పెప్సీకో, ఆర్సెలర్ మిట్టల్, గూగుల్, టోటల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మైక్రోసాప్ట్, బ్రిటిష్ పెట్రోలియం, సిటీ గ్రూప్, డాయిష్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఫోక్స్‌వ్యాగన్, యూబీఎస్, యూనిలీవర్, స్టాన్‌చార్ట్ వంటివి ఇందులో కొన్ని. భారత్ నుంచి పాల్గొంటున్నదెవరు ఆర్థిక మంత్రి పి. చిదంబరం, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, పట్టణాభివృద్ధి-పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్, భారీ పరిశ్రమలు-ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వం తరపున ప్రధానంగా హాజరుకానున్నారు. మన కార్పొరేట్లలో ముఖ్యులు.. భారత్ నుంచి మొత్తం 100 మంది కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. వీరిలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, గోద్రెజ్ గ్రూప్ అధినేత ఆది గోద్రెజ్, జీఎంఆర్ గ్రూప్ అధిపతి జీఎం రావు, బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్, భారతీ గ్రూప్ సీఎండీ సునీల్ మిట్టల్, గౌతమ్ అదానీ, సీఐఐ ప్రెసిడెంట్ క్రిస్ గోపాలకృష్ణన్, పవన్ ముంజాల్, నైనా లాల్ కిద్వాయ్, నరేశ్ గోయెల్ తదితర ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. 2014 సదస్సుకు సహాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వారిలో క్రిస్ గోపాలకృష్ణన్ కూడా ఒకరు. సమావేశాల్లో బాలీవుడ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌ను కూడా నిర్వహించనుండటం గమనార్హం.