మీరు పాక్‌ మద్దతుదారులా..? | You Pak Supporters?': Bihar Minister's Patriotism Test For Journalists | Sakshi
Sakshi News home page

మీరు పాక్‌ మద్దతుదారులా..?

Published Wed, Aug 9 2017 4:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

మీరు పాక్‌ మద్దతుదారులా..?

మీరు పాక్‌ మద్దతుదారులా..?

పాట్నా: ఓ బీహార్‌ మం‍త్రి పాత్రికేయుల దేశభక్తికి పరీక్ష పెట్టారు. తన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులను ఆయన టార్గెట్‌ చేశారు. పాట్నాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మం‍త్రి వినోద్‌ కుమార్‌ సింగ్‌ భారత్‌ మాతా కీ జై అని నినదించాలని సభికులను కోరారు. సభికుల నుంచి వచ్చిన స్పందనకు సంతృప్తి చెందని మం‍త్రి ముందు వరుసలో ఉన్న జర్నలిస్టులను టార్గెట్‌ చేస్తూ కొందరు భారత్‌ మాతాకీ జై అని నినదించడం లేదని, వారు పాకిస్తాన్‌ మాతను గౌరవిస్తారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

జర్నలిస్టులైనా, మరెవరైనా ముందుగా మీరు భరతమాత బిడ్డలు ఆ తర్వాతే మీడియా ప్రతినిధులంటూ హితవు పలికారు. బీజేపీకి చెందిన వినోద్‌ కుమార్‌ సింగ్‌ నితీష్‌ సర్కార్‌లో గనులు, భూగర్భ శాఖల మం‍త్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement