
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువకులు హల్ చల్ చేశారు. స్థానికల ఆదర్శ్ నగర్‌లో రెండు గ్రూపులకు చెందిన యువకులు ఆదివారం అర్థరాత్రి కత్తులు, ఇనుప రాడ్‌లతో దాడులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఐదుగురు యువకులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రిలో కూడా యువకులు మరోసారి గొడవకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అస్సత్రికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. ఇరువర్గాల దాడులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment