పర్యాటకుల స్వర్గధామమైన మలేషియాలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులు జరిమానా, శిక్ష లేకుండా వారి దేశాలకు వెళ్లిపోవడానికి క్షమాభిక్ష అమలు చేస్తుంటాయి. ఇదే విధానాన్ని మలేషియా దేశం అమలు చేస్తోంది. ఈనెల ఒకటో తేదిన క్షమాభిక్ష అమలులోకి వచ్చింది. డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది ఆ దేశంలో అక్రమంగా ఉంటున్నారని అంచనా. గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, గతంలో మాదిరిగా జీతాలు లేకపోవడంతో అనేక మంది మలేషియా బాట పట్టారు. ఎక్కువ మంది వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలతో మలేషియాకు పంపించారు. వారికి సరైన అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. మలేషియా ప్రభు త్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను వినియోగించుకుని వారంతా స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment