
మోర్తాడ్: పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం24వ దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. ఈనెల 29న దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించనుంది. గ్లోబల్ విలేజ్ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా పర్యాటకులను ఆకర్షించడానికి 3,500 షాపింగ్ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు. పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రతి ఏటా దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఎన్నో దేశాల పర్యాటకులు ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొని తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తుంటారు.
అనేక రకాల సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తారు. షాపింగ్ ఔట్‌లెట్స్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన వివిధ రకాల ఆహార పదార్థాలను వండిపెట్టడానికి రెస్టారెంట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఊష్ణోగ్రతలు తగ్గిన తరువాత అంటే.. శీతాకాలం ఆరంభమయ్యేసమయంలో దుబాయి షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. వివిధ దేశాల సంస్కృతి, కళలకు అద్దం పట్టేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. దాదాపు80 దేశాల పర్యాటకులు ఈ దుబాయి షాపింగ్‌ఫెస్టివల్‌లో పాల్గొంటారని అంచనా. తెలంగాణజిల్లాలకు చెందిన ఎంతో మంది యూఏఈలోఉపాధి పొందుతున్నారు. ఆ దేశంలో నివాసముంటున్నమన ప్రాంత కార్మికులు సెలవు దినాల్లోఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment