
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సోసైటీ(గేట్స్) ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జూన్ 23న ఆదివారం నాడు కుమ్మింగ్‌లోని లేనియర్ టెక్నికల్ కాలేజీలో ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 1000 మందిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. స్థానిక నేతలతో పాటు పలువరు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గేట్స్ బోర్డు ఛైర్మన్ అనిల్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి పిట్ట సారథ్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నృత్యాలు, బుర్రకథలు, కాకతీయ చరిత్రను వివరిస్తూ నృత్య ప్రదర్శన, పేరిణీ తాండవం, బోనాలు, బతుకమ్మ, గుస్సాది, లంబాడీ, గిరిజన నృత్యాలు, తెలంగాణ సమరయోధుల నాట్య రూపకం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా భువనేష్ బుజాల(ఆటా), ఆల రామక్రిష్ణారెడ్డి(ఆటా,బోట్), అంజయ్య చౌదరి లావు (తానా), భరత్ మాదాది(టాటా), డా.శ్రీని గంగసాని, సునీల్ సావిలి, శ్రీనివాసరెడ్డి పెద్ది( ఐఎఫ్‌ఏ), సత్యనారాయణరెడ్డి తంగిరాల(గాటా), వెంకీ గద్దె, వినయ్‌లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో ఛైర్మన్ బోధిరెడ్డి, ప్రెసిడెంట్ తిరుమలరెడ్డి పిట్ట, వైఎస్ ప్రెసిడెంట్ రాహుల్ చిక్యాల, జనరల్ సెక్రటరీ కిషన్ తాళ్లపల్లి, ట్రెజరర్ అనితా నెల్లుట్ల, జనార్థన్ పన్నెల(యూత్ అండ్ స్పోర్ట్స్), సునీల్ గోతూర్( ఈవెంట్ సెక్రటరీ), శ్రీనివాస్ పర్సా (కల్చరల్ సెక్రటరీ), శ్రీధర్ నెల్వల్లి, రఘు బండ, చిట్టారి ప్రభా, రమాచారి, గణేశ్ కాశం, వెన్నెమనేని చలపతి, సతీష్ నందాల, గేట్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు కరుణ్ ఆశిరెడ్డి, గౌతమ్‌గోలి, ప్రభాకర్ బోయపల్లి, శ్రీధర్ జూలపల్లి, సతీష్ చెటిల కృషి అమోఘమని పలువురు కొనియాడారు.