
మనీందర్ సింగ్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : అమెరికాలోభారత సంతతి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దొంగతనానికి వచ్చిన గుర్తితెలియన దుండగులు అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో చోటు చేసుకుంది. మృతుడు హరియాణా రాష్ట్రానికి చెందిన మనీందర్ సింగ్ సాహిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని కర్నాల్ నగరానికి చెందిన మనీందర్ సింగ్ సాహి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో గల ఓ స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
కాగా, గత శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మనీందర్ సింగ్ స్టోర్‌లో ఉండగా గుర్తుతెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో స్టోర్‌లో ఇద్దరు కస్టమర్లు మాత్రమే ఉన్నారు. అయితే వారిపై ఎలాంటి దాడి చేయని దుండగుడు స్టోర్ ఉద్యోగి మనీందర్ సింగ్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు. అనంతరం కౌంటర్‌లో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోయాడు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అమెరికా పోలీసులు పేర్కొన్నారు.
కాగా, మనీందర్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 31న మనీందర్ సింగ్ తిరిగి అమెరికాకు వచ్చారు. మృత దేహాన్ని ఇండియాకు తరలించేందుకు డబ్బులు లేవని, భారత ప్రభుత్వం సహాయం చేయాలని మృతుడి సోదరుడు విజ్ఞప్తి చేశాడు.
***HOMICIDE UPDATE*** Homicide occurred at the 7-11 store 8438 Santa Fe Springs Road. Suspect entered the store with a semi-automatic handgun killing the clerk. Suspect is described as a male black adult, 5-06/5-07. Anyone with information contact Whittier PD 562-567-9281. pic.twitter.com/MSNhvcHrJB
— Whittier Police Dept (@whittierpd) February 23, 2020
Comments
Please login to add a commentAdd a comment