న్యూజిలాండ్‌లో కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు | kcr birthday grand celebrations in new zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌లో కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు

Published Fri, Feb 16 2018 11:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

kcr birthday grand celebrations in new zealand - Sakshi

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కేకు కట్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు

టీఆర్‌ఎస్‌ న్యూజిలాండ్‌ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు జన్మదిన వేడుకలు(ఫిబ్రవరి 17) గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెరాస న్యూజిలాండ్‌ ఆధ్వర్యంలో ఎస్సం న్యూజిలాండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదాన  శిబిరం నిర్వహించారు. సెలవురోజు కాకపోయినా ముఖ్యమంత్రి మీద ఉన్న అభిమానంతో వచ్చి రక్తదానం చేసిన కేసీఆర్‌ అభిమానులకు టీఆర్ఎస్‌ న్యూజిలాండ్‌ అధ్యక్షుడు విజయ్‌ భాస్కర్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోరుకొనే కేసీఆర్‌కు భగవంతుడు గట్టి ఆయుష్షు ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రక్తదానంతో పాటు 16న గణేష్‌ హోమం జరపనున్నట్లు వెల్లడించారు. రక్తదాన శిబిరంలో శ్రీరాం యాదవ్‌ బిజ్జు, వరుణ్‌ రావు మేచినేని, విజేత రావు, అఖిల రావు, ప్రతీక్‌, రాజేశ్వరి కొండగారి, జయ్‌ బెల్లంకొండలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సలహాలు, సూచనలు, ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్‌ బిగాల సమన్వయంలో న్యూజిల్యాండ్‌ టీఆర్‌ఎస్‌ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

రక్తదానం విజయవంతం కావడానికి కృషిచేసిన తెరాస న్యూజిల్యాండ్‌ గౌరవ అధ్యక్షులు కళ్యాణ్‌ రావు కాసుగంటి, జనరల్‌ సెక్రటరీ నర్సింగ రావు ఇనగంటి, వైస్‌ ప్రెసిడెంట్‌ సీతారాం  సాళ్వాజీ, వైఎస్‌ ప్రెసిడెంట్ రామారావు రాచకొండ, కోశాధికారి అభిలాష్ రావు యాచమనేని, ఉమెన్స్‌ అఫైర్స్‌ ఛైర్పర్సన్‌ సునీతావిజయ్‌, ఇమిగ్రేషన్‌ అడ్వైజర్‌, సుజిత్‌ సింగ్‌, మెంబర్షిప్‌ ఇంచార్జ్‌ కిరణ్‌కుమార్‌ పోకలకు విజయ్‌ భాస్కర్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేస్తున్న అభిమానులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement