సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలికారు. ‘కోటి వృక్షార్చన’ పేరిట గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఉద్యమ స్ఫూర్తితో సాగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం గ్రేటర్‌లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
లైవ్ అప్‌డేట్స్ :
► కోటి వృక్షార్చన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రుద్రాక్ష మొక్కను నాటారు. సీఎం వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ ఇతర నేతలు ఉన్నారు
►మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్పూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక కోటి వృక్షార్చన లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.
► కేసీఆర్ జీవిత చరిత్రపై డాక్యుమెంటరీ ప్రదర్శన
►సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహుకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ.
► సిద్ధిపేట: సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నర్సాపూర్ రోడ్డులో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు.
►కరీంనగర్ జిల్లా: సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, కోటి వృక్షార్చనలో భాగంగా నగరంలో పలు చోట్ల మొక్కలు నాటిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై. సునీల్ రావు.
♦ తన క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.
►సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండలంలోని కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్యరావు.
♦సంగారెడ్డి కంది జిల్లా కేంద్ర జైలు వద్ద మొక్కలు నాటిన హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి
నగరంలో ఇవీ కార్యక్రమాలు
►అమీర్‌పేటలోని గురుద్వారలో గురుగ్రంధ్ సాహెబ్‌కు ప్రత్యేక పూజలు
►బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీర అమ్మవారికి సమర్పణ
►సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన
►సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు
►క్లాక్ టవర్ వద్ద గల వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లి లోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ
►జలవిహార్‌లో 10.30 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం.. 10.30 గంటలకు త్రీ డీ డాక్యుమెంటరీ.. 11.00 గంటలకు కేక్ కటింగ్.
Comments
Please login to add a commentAdd a comment