
సెయింట్ లూయిస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక ఆంధ్రుడు గొంతెత్తి అరుస్తుంటే, ఆ అరుపులు కేంద్రానికి వినబడటం లేదా అని అమెరికా సెయింట్ లూయిస్ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పోరులో తమ వంతు బాధ్యతగా సెయింట్ లూయిస్ వైఎస్సార్‌సీపీ విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, ప్లకార్డులు చేత పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీ కలిసి నాశనం చేశాయని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, పదవులను సైతం వదులుకున్నారని ఆయనకు తాము మద్దతుగా ఉంటామన్నారు.
హోదా కోసం ఈ నెల 30న వైఎస్సార్‌సీపీ నిర్వహించే ‘వంచన దినం’ కార్యక్రమానికి తమ వంతు మద్దతుగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిరసనలు చేపతామని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కోర్ కమిటీ రీజినల్ ఇంచార్జ్ పమ్మి సుబ్బారెడ్డితో పాటు అమెరికా విభాగం సభ్యులు లీలాధర్, పటోళ్ళ మోహిత్, ఎవురు మురళి, దగ్గుమాటి శ్రీని, రాజేంద్ర, రంగ సురేష్, గుడవల్లి నవీన్, తాటిపర్తి సుబ్బారెడ్డి, తోటపల్లి హరిహర, తాటిపర్తి గోపాల్, శ్యామల శ్రీని, వేదనపర్తి విజయ్, వెన్నపూస ప్రవీణ్, షేక్ కబీర్, బత్తుల దినేష్, శ్రావణ్, తలకంటి యోగి, ఆర్కే, మహేష్ కుమార్, కుర్రబోలు రమేష్, మరియు వైఎస్సార్ సీపీ సెయింట్ లూయిస్ విభాగం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment