candels rally
-
సారా ఎవెరార్డ్ హత్య ప్రకంపనలు
లండన్: దక్షిణ లండన్‌లో 33 ఏళ్ల యువతి సారా ఎవెరార్డ్ హత్యను నిరసిస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకున్న స్కాట్‌ల్యాండ్ పోలీసులు తమ చర్యల్ని పూర్తిగా సమర్థించు కున్నారు. కరోనా నిబంధనల్ని అతిక్రమిస్తూ జనం సారాకి మద్దతుగా భారీ సంఖ్యలో గుమిగూడడం వల్లే వారిని చెదరగొట్టామని చెబుతున్నారు. ర్యాలీలో పాల్గొన్నవారిలో నలుగురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ‘‘ప్రజల భద్రత గురించి ఆలోచిస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇంకా కరోనా సంక్షోభం ముగియకుండా అంత మంది ఒకే చోట గుమిగూడడం మంచిది కాదు’’అని పోలీసు కమిషనర్ హెలెన్ బాల్ అన్నారు. ‘‘పోలీసులు వెళ్లిపోమని చెప్పగానే చాలా మంది వెనక్కి మళ్లారు కానీ కొంత మంది పోలీసులపైకి వస్తువులు విసిరారు. అందుకే వారిని కట్టడి చేయాల్సి వచ్చింది’’అని చెప్పారు. అయితే పోలీసులకి, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరస్ అయ్యాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ సహా ఎందరో నాయకులు దీనిపై స్పందించారు. పోలీసుల తీరుని తప్పు పట్టారు. గత వారంలో స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ సారా ఎవెరార్డ్ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత శవమై కనిపించడం బ్రిటన్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు బయటకి వచ్చి హత్యను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు. -
ఉగ్రదాడిని ఖండించిన యావత్ భారతావని
సాక్షి, న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను యావత్ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరలని దేశ వ్యాప్తంగా ప్రార్థించారు. ‘జై జవాన్.. అమర జవాన్’ నినాదాలతో భారతదేశం హోరెత్తింది. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధంచేసి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమరులకు నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జవాన్లపై దాడికి పాల్పడిన వారికి ఖచ్చితంగా బదులిచ్చి తీరాలని యావత్ దేశం డిమాండ్ చేసింది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పాఠశాల చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో కూడా అమరులకు ఘన నివాళి అందించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా హైదరాబాద్‌లో క్రైమ్ జర్నలిస్టులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా వర్ణించారు. అమరవీరుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని పలువురు జర్నలిస్టులు తెలిపారు. ఏపీలో పట్టణాల్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రవాదులు దాడికి సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. -
అశ్విని దారుణ హత్య.. తీర్పుపై తీవ్ర దిగ్భ్రాంతి
విశాఖపట్నం : 2011లోఇంటర్మీడియేట్ విద్యార్థిని రాపేటి అశ్విని మృదుల(16)ను దుండగులు కత్తితో మెడ కోసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విశాఖ నగరంలో ఎంతో సంచలనం సృష్టించింది. పట్టపగలే ఓ విద్యార్థిని తన ఇంట్లోనే దారుణ హత్యకు గురికావడం నగరవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అశ్వినిని హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు పట్టుకుని, కోర్టులో హాజరు పరిచారు. అయితే ఇన్నేళ్ల పాటుసాగిన ఈ కేసు చిట్టచివరికి డబ్బు వైపే మొగ్గు చూపి, న్యాయాన్ని నిజంగానే అంధకారంలో ముంచేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ కూతుర్ని చంపిన వారికి కఠినంగా శిక్ష వేసి, ఆమె ఆత్మకు శాంతి కలగజేస్తారని భావించిన అశ్విని తల్లిదండ్రులకు నేడు తీవ్ర పరాభావం ఎదురైంది. దాదాపు ఏడేళ్ల పాటు విచారణ సాగిన ఈ కేసుపై నేడు బాధితురాలికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. అశ్వినిని చంపిన నలుగురు నిందితులను నిర్దేషులుగా ప్రకటిస్తూ.. జడ్జి తీర్పు వెలురించారు. నలుగురు నిందితులకు అనుకూలంగా తీర్పు చెప్పిన అనంతరం, కేసును మూసివేస్తున్నట్టు జడ్జి ప్రకటించారు. కేసు మూసివేస్తున్నట్టు జడ్జి తీర్పు వెలువరించగానే, నిందితులు మరింత రెచ్చిపోయారు. కూతురు హత్య కేసులో కొన్నేళ్లుగా పోరాడుతున్న అశ్విని తల్లిపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అశ్విని తల్లి కూడా న్యాయవాదే. ఈ నేపథ్యంలో ఆమెను మరింత కుంగుబాటుకు గురి చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రామ్ మూర్తి నాయుడు, జడ్జి శేషు బాబు నిందితులతో జత కట్టి, వారికి అనుకూలంగా తీర్పు వచ్చేలా డబ్బుతో న్యాయాన్ని కొనేశారని అశ్విని తల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశ్వినిని నిందితులే హత్య చేశారు అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిందితుల వేలిముద్రలు అశ్వినిని హత్య చేసిన వారి వేలిముద్రలతో సరిపోవడమే కాకుండా.. ఆమె చెవి పోగులు, చెయిన్ నిందితుల దగ్గర లభించాయి. అయినప్పటికీ వీరు అమాయకులని, వారికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని కేసును జడ్జి మూసివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నేడు నగరంలో గాంధీ విగ్రహం నుంచి కమిషనర్ ఆఫీసు వరకు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శిస్తున్నారు. నాలుగు గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతోంది. జస్టిస్ఫర్అశ్వినిమృదుల అనే హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అశ్విని చనిపోయినప్పటి నుంచి ఈ కేసుపై తీవ్రంగా పోరాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ నిందితులకు అనుకూలంగా తీర్పురావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని పలువురు అంటున్నారు. కాగ, విశాఖలోని దొండపర్తి జంక్షన్‌లోని మెట్రో రెసిడెన్సీలోని ఈ హత్య జరిగింది. అశ్విని మృదులను మధ్యాహ్నం అన్నం తినే సమయంలో ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తుండగా.. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. హత్య జరిగిన రోజు తల్లి హైదరాబాద్‌లో ఉన్నారు. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్న తమ్ముడు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగింది. మృదుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్నేహితులు, సన్నిహితులు సామాజిక మాధ్యమాల్లో నినదిస్తున్నారు. -
హోదా కోసం ప్రవాసాంధ్రుల నిరసనలు
సెయింట్ లూయిస్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక ఆంధ్రుడు గొంతెత్తి అరుస్తుంటే, ఆ అరుపులు కేంద్రానికి వినబడటం లేదా అని అమెరికా సెయింట్ లూయిస్ వైఎస్సార్సీపీ మద్దతుదారులు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పోరులో తమ వంతు బాధ్యతగా సెయింట్ లూయిస్ వైఎస్సార్సీపీ విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, ప్లకార్డులు చేత పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీ కలిసి నాశనం చేశాయని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారని, పదవులను సైతం వదులుకున్నారని ఆయనకు తాము మద్దతుగా ఉంటామన్నారు. హోదా కోసం ఈ నెల 30న వైఎస్సార్సీపీ నిర్వహించే ‘వంచన దినం’ కార్యక్రమానికి తమ వంతు మద్దతుగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నిరసనలు చేపతామని వారు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమెరికా కోర్ కమిటీ రీజినల్ ఇంచార్జ్ పమ్మి సుబ్బారెడ్డితో పాటు అమెరికా విభాగం సభ్యులు లీలాధర్, పటోళ్ళ మోహిత్, ఎవురు మురళి, దగ్గుమాటి శ్రీని, రాజేంద్ర, రంగ సురేష్, గుడవల్లి నవీన్, తాటిపర్తి సుబ్బారెడ్డి, తోటపల్లి హరిహర, తాటిపర్తి గోపాల్, శ్యామల శ్రీని, వేదనపర్తి విజయ్, వెన్నపూస ప్రవీణ్, షేక్ కబీర్, బత్తుల దినేష్, శ్రావణ్, తలకంటి యోగి, ఆర్కే, మహేష్ కుమార్, కుర్రబోలు రమేష్, మరియు వైఎస్సార్ సీపీ సెయింట్ లూయిస్ విభాగం సభ్యులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి యుఎస్ఏ ఎన్ఆర్ఐల సంఘీభావం
అమెరికా: ఏపీ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్పార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి యుఎస్ఏ ఎన్ఆర్ఐలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ యుఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగం అధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బేఏరియా, కాలిఫొర్నియాలో అనేక మంది తెలుగువారు, పార్టీ అభిమానులు కొవ్వుత్తుల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ మధులిక మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నిర్వర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేకహోదా ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి అనేక దీక్షలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్‌రెడ్డి పోరాటానికి మద్దతుగా అమెరికా వ్యాప్తంగా హార్ట్పోర్ట్ సిటి, ఫ్రిమౌంట్, డల్లాస్, ఫోరిడా, ఓర్లాండోతోపాటు అనేక నగరాల్లో ప్రదర్శనలు చేసినట్లు తెలిపారు. అమెరాకాలోని తెలుగువారి సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపి యుఎస్ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ కేవీ రెడ్డి మాట్లాడుతూ... జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ప్రత్యేక హోదా కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి ఏపీ ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. హార్డ్‌ఫోర్ సిటిలో వైఎస్సాఆర్ సీపీ యుఎస్ఏ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి, సురేంద్ర అబ్బవరం, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రవీణ్, సహదేవా, హరిమోయ్యి, త్రిలోక్, విజయ్, కొండారెడ్డి, శివ, అమర్, రాఘవ, వెంకట్, నరేంద్ర అట్టునూరి, సుబ్బారెడ్డి భాస్కర్, లోకేష్, శ్రీధర్, రవి కర్రి, వైఎస్సార్సీపీ విధ్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు -
ప్రత్యేక హోదా కోసం రేపు కొవ్వొత్తుల ప్రదర్శన
కాకినాడ రూరల్ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26 సాయంత్రం 5.30 గంటలకు కాకినాడ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. మంగళవారం సాయంత్ర రమణయ్యపేటలోని తన నివాస గృహంలో విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలంతా కేంద్రాన్ని ఒప్పించే విధంగా పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ, యువకులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు మద్దతు తెలిపి కొవ్వొత్తుల ప్రదర్శనలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు వైఎస్సార్ బ్రిడ్జి వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి భారీ ర్యాలీగా భానుగుడి జంక్ష¯ŒSకు చేరుకొని ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రంపచోడవరం : గురువారం కాకినాడ లో జరగనున్న కొవ్వొత్తుల ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు అనంతబాబు పిలుపునిచ్చారు.