సింగపూర్‌లో ఘనంగా వినాయకచవితి వేడుకలు | Vinayakachavithi celebrations in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా వినాయకచవితి వేడుకలు

Published Sat, Sep 15 2018 4:20 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

Vinayakachavithi celebrations in Singapore - Sakshi

సింగపూర్‌ : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయకచవితి పూజావేడుకలను యిషున్ హోలీట్రీ శ్రీ బాలమునియార్ దేవస్థానప్రాంగణంలోని హెచ్ టి యస్ బి ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది స్థానిక తెలుగువారు పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మంది చిన్నారులు బాల గణపతి పూజ చేశారు. బాల గణపతి పూజ భక్తులను విశేషంగా ఆకట్టుకొంది. కార్యక్రమానంతరం అన్నప్రసాదవితరణ జరిపారు.

ఈ సంధర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ, సుమారు 650 మంది స్థానిక తెలుగువారికి 21 రకాల పత్రిని ఉచితంగా అందించామని తెలిపారు. కార్యక్రమనిర్వాహకులు వినయ్ మాట్లాడుతూ అందరికీ మంచిజరగాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంకావడానికి చాలామంది సహాయసహకారాలనందించారని తెలిపారు. కార్యవర్గసభ్యులకు , దాతలకు, పూజాకార్యక్రమంలో పాల్గొన్నవారికి, పూజలో పాల్గొన్న పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement