సోవియెట్ పుస్తకాలు కావాలా?
ఆ రోజులే వేరు. ఆ పుస్తకాలు కూడా వేరు. ఆ ఫాంట్, అట్ట, బొమ్మలు, పుస్తకం మొత్తం చేతిలో పట్టుకుంటే వచ్చే అందం... ఆ స్తెప్ మైదానం, సెయింట్ పీటర్స్ బర్గ్, నికొలాయ్, మాషా, తాషా పాత్రలు... సోవియెట్ సాహిత్యంతో పాటుగా ఒక తరం ఎదిగింది. ఒక తరం దానిని అనుసరించింది. కాని ఆ రోజులు ఇప్పుడు లేవు. ఆ పుస్తకాలు అందుబాటులో కూడా లేవు. కాని సోవియెట్ పుస్తకాల అభిమాని అనిల్ బత్తుల (9676365115) తన దగ్గరున్న సోవియెట్ కలెక్షన్‌తో ఒక బ్లాగ్ ఏర్పాటు చేశాడు. మీకు నచ్చిన పుస్తకాలు ఇక్కడ చూడొచ్చు. కొన్ని నేరుగా చదవొచ్చు. కొన్ని అతడి నుంచి పి.డి.ఎఫ్ పద్ధతిలో తెప్పించుకొని కూడా చదవొచ్చు.
http://sovietbooksintelugu.blogspot.in/