అంగ వికలుర బిల్లుకూ వైకల్యమే! | A hurried disabilities Bill will serve no purpose | Sakshi
Sakshi News home page

అంగ వికలుర బిల్లుకూ వైకల్యమే!

Published Thu, Feb 20 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

అంగ వికలుర బిల్లుకూ వైకల్యమే!

అంగ వికలుర బిల్లుకూ వైకల్యమే!

ఐక్యరాజ్యసమితి సదస్సు తీర్మానం ప్రకారం వికలాంగులకు మిగిలిన వారితో సమాన హక్కులు కల్పించాలి. కొత్త బిల్లు ఇప్పటి వరకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచినప్పటికీ, అవకాశాల పరిధిని బాగా కుదించడం వివాదాస్పదమైంది.  
 
 పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ కొత్త బిల్లు అయినా ప్రజాప్రయోజనాలను ఆశించి ఉం డాలి. కానీ యూపీఏ-2 ప్రవేశపెట్టిన ఎక్కువ బిల్లుల ఉద్దేశం వెనుక ప్రజాప్రయోజనం కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనమే ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ అంగవికలుర హక్కుల బిల్లు-2012. ఈ బిల్లును కూడా ఈ సమావేశాలలోనే ఆమోదిం చాలని కేంద్రం హడావుడి పడుతోంది. ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టింది కూడా.
 
 అంగ వైకల్యం కలిగిన వ్యక్తుల హక్కుల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక సదస్సులో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడానికి భారత ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తున్నది. ఇది ఆహ్వానించదగినదే. ఆ ఉద్దేశంతోనే 2009లో సాధికారత, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కొత్త బిల్లును రూపొందించడానికి ఒక సంఘాన్ని నియమించింది. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెరి బ్రెల్ పాల్సీ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సుధా కౌల్ కు ఈ సంఘం నాయకత్వం అప్పగించారు. సంఘం తన ముసాయిదాను 2011లోనే వెలువరించి, 2012లో మంత్రిమండలి ఆమోదానికి పంపింది. ఇంత కీలకమైన బిల్లుకు ఆమో దం తెలపడానికి కూడా ఏడాది కాలం పట్టింది. ఏ బిల్లుకైనా కొన్ని సవరణలు తప్పకపోవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, సమన్యాయం, హక్కులు వంటి అంశాలతో ముడిపడి ఉన్న బిల్లుకు సవరణలు అనివార్యమే. వీటన్నిటినీ పక్కకు పెట్టి బిల్లును ఈ సమావేశాలలోనే ఆమోదించాలని యూపీఏ తొందరపడడమే విడ్డూరం.
 
 ఐక్యరాజ్యసమితి సదస్సు తీర్మానం ప్రకారం వికలాంగులకు మిగిలిన వారితో సమాన హక్కులు కల్పించాలి. కొత్త బిల్లు ఇప్పటి వరకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచినప్పటికీ, అవకాశాల పరిధిని బాగా కుదించడం వివాదాస్పదమైంది. రిజర్వేషన్ శాతం పెరిగినా అది మేలు కంటె కీడే ఎక్కువ చేసే విధంగా తయారయిం ది. అందుకే పదహారు సవరణలతో ఈ బిల్లు ను ప్రవేశపెట్టారు. వైకల్యాన్ని నిర్వచించడం లో కూడా ప్రభుత్వం విశాల దృష్టిని చూపలేకపోయింది. ప్రస్తుతం 1995 నాటి చట్టాన్ని వికలాంగులకు వర్తింప చేస్తున్నారు. దాని ప్రకా రం ఏడురకాల వైకల్యా లు, నలభై శాతానికి మించి ఉంటే వారిని ఈ చట్టం పరిధిలోకి తెస్తున్నారు. అంధత్వం, కంటిచూపులో లోపం, బధిరత్వం, లోకోమోటర్ వైకల్యం, మానసిక రుగ్మత, మానసిక వైకల్యం, కుష్టు-ఈ ఏడిం టిని అంగ వికలుర కోటాలో హక్కులు పొందడానికి అవకాశం ఇచ్చేవిగా నిర్వచించారు.
 
 కానీ వైకల్యంలో ఇంత శాతమని నిర్ణయిం చడం సాధ్యం కాదు. ఈ పరిధులు అంగవైకల్యం సమస్యను ఎదుర్కొనడానికి అడ్డంకిగానే ఉంటాయి. అస లు ఈ నిర్వచనం కూడా ఐక్యరాజ్యసమితి సదస్సు తీర్మానం పరిధిలో లేదన్నది మరో విమర్శ. చట్టం ముందు అంతా సమానమే అన్న హక్కు వీరికీ లభించాలని ఆ సదస్సు స్పష్టం చేసింది. నిజానికి అంగ వికలురకు రక్షణ కల్పించడంలో భౌతికమైన అంశం కంటె, సమాజం అలాంటి వారి పట్ల ఏర్పరుచుకున్న దృక్పథం గురించి ఎక్కువ ఆలోచన ఉండాలి. ఈ ఆశయానికే 1995 నాటి చట్టం దూరంగా ఉంది. కొత్త బిల్లులో లోపం కూడా సరిగ్గా ఇదే. కొన్ని ఇతర భౌతిక లోపాలను కూడా ప్రపంచ వ్యాప్తంగా అంగ వైకల్యంగా పరిగణిస్తున్నారు. బిల్లు వీటినీ పట్టించుకోలేదు. బుద్ధిమాంద్యం (ఆటిజం వంటివి), మరుగుజ్జుతనం, హెచ్‌ఐవీ- ఎయిడ్స్‌లను వైకల్యంగా భారత న్యాయస్థానాలు కూడా గుర్తించాయి. అలాగే ప్రైవేటు సంస్థలలో రిజర్వేషన్‌కు కొత్త బిల్లు కూడా వీరికి అవకాశం కల్పించడం లేదు.
 
 బిల్లును యథాతథంగా ప్రవేశపెడితే వికలాంగులకు సమన్యాయం జరగడం కల్ల అన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థకే రిజర్వేషన్ పరిమితం చేస్తే అందరికీ, ముఖ్యంగా నేటి చదువులకు తగ్గట్టు అవకాశాలు ఎలా వస్తాయన్నదే ప్రశ్న. కీలకమైన ఈ బిల్లును ఆదరాబాదరాగానైనా ఆమోదింప చేసి ఆ కీర్తిని కూడా జమ చేసుకోవాలని కాం గ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అంతేతప్ప బిల్లు మౌ లిక లక్షణాలు, ఉద్దేశాల మీదే విమర్శలు వెల్లువెత్తిన సంగతిని పట్టించుకోవడం లేదు.     
 - కల్హణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement