మరో ‘కమిటీ’ని నియమించాలి
సందర్భం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ఇక్కడి ఉద్యో గులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే భావనతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గా లన్నీ కలసి పోరాటం చేశా యి. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా తెలం గాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోంది. విభజన బిల్లులో ఉద్యోగుల, పెన్షనర్ల విభజనలో జిల్లా జోన్, మల్టీ జోనల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే ఉంటారనే ప్రతిపా దనతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోం ది. పార్లమెంటు చట్టం రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పు లతోపాటు ఉద్యోగుల పంపిణీ 58:42 నిష్పత్తి ప్రకా రం జరగాలన్నది చెబుతుంది. కానీ ఉద్యోగుల విభ జనలో ఈ సూత్రం పనిచెయ్యదు. కమల్‌నాథన్ కమిటీ/షీలాబిడే కమిటీలు కేవలం ఉన్న ఉద్యోగుల ను 58:42 శాతం విభజించడానికే పరిమితం అవు తున్నాయి. అన్ని క్యాడర్లలో 42 శాతం మంది తెలం గాణ ఉద్యోగులు లేరన్నది వాస్తవం. కానీ తెలంగా ణకు కేటాయించే 42 శాతంలో కూడా నిజమైన తెలంగాణ వాళ్లు ఉండరనేది తెలంగాణ ఉద్యోగుల వాదన. సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విభజన జరుగు తున్నది కేవలం సచివాలయం హెచ్‌ఓడీలలో మా త్రమే. కానీ అసలు సమస్య జిల్లాలో ఉన్న స్థానికేత రులతోనే! వారిని పంపించకుండా కేవలం రాష్ట్ర స్థాయిలో విభజనను చేపట్టడం వలన, ఉల్లంఘన తో దొడ్డిదారిలో వచ్చిన స్థానికేతరులను స్థానికు లుగా గుర్తించడమే అవుతుంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయిలో 20 శాతం, జోనల్ స్థాయిలో 30 శాతంగా ఉన్న ఓపెన్ కోటాలో కేవలం స్థానికేతరులకు అవకాశాలు ఇవ్వ డంవల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యా యం జరిగిందని గిర్‌గ్లానితో పాటు అనేక కమిటీలు స్పష్టంగా పేర్కొన్నాయి. పదవ తరగతి వరకు వరు సగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ వ్యక్తిని స్థానికు డిగా పరిగణించడమనే నిబంధన తెలంగాణ నిరు ద్యోగులకు గొడ్డలిపెట్టు. సమైక్య రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉద్యోగాలు చేసిన ఉద్యోగులు, వ్యాపారం పేరిట ఇక్కడకు వచ్చిన వారు, వారి పిల్లలు, అందరూ స్థానికులైతే తెలం గాణ భూమిపుత్రులకు నోట్లో మట్టే. 1956 నుంచి తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాల పట్ల నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ నే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసు కొన్న ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ తీసుకో వాలి. హెల్త్ కార్డులు, పీఆర్‌సీలు, ఫిట్‌మెంట్‌లు కాదు. ముందుగా విభజనపై దృష్టి సారించాలి. పార్లమెంటు చట్టంలో మార్పులకై పట్టుబట్టాలి. స్థానికేతరులు ఉద్యోగాల్లో చొరబడకుండా కట్టుది ట్టంగా వ్యవహరించాలి. కచ్చితమైన క్యాడర్ స్ట్రెంత్ ను ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ ప్రమోషన్లు, డీపీసీలు ఏర్పాటు చేసి ఖాళీలను పూరించాలి.
కమలనాథన్ కమిటీ పనిచేసే తీరులోనే అశా స్త్రీయ ధోరణులు కనబడుతున్నాయి. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని రాష్ట్ర స్థాయిగా గుర్తించి జనాభా దామా షాలో 58.32 శాతం సీమాంధ్రకు, 41.68 శాతం తెలంగాణకు కేటాయింపులు చేస్తున్నారు. మొదట ఖాళీలను, తదుపరి వ్యక్తులను పంచుతున్నారు. అస లు (క్యాడర్ స్ట్రెంత్)ను మంజూరు అయిన పోస్టు లను పక్కనబెట్టి కేవలం పనిచేస్తున్న వారిని (వర్కిం గ్ స్ట్రెంత్)ను విభజించడం వల్ల తెలంగాణ ఉద్యోగు లు ఆంధ్రలో, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయి అధికారు లను జిల్లా, జోనల్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగు లను ‘ఎక్కడ వారిని అక్కడే’ ఉంచడం వల్ల సీమాం ధ్రలో కొందరు తెలంగాణ ఉద్యోగులు, తెలంగా ణలో వేలాది మంది ఉద్యోగులు చట్టబద్ధంగా ఉండి పోయే పరిస్థితి వస్తుంది. కలమనాథన్, షిలాబిడే కమిటీలతో పాటు అవసరమైతే రాజ్యాంగబద్ధత కలిగిన మరో కమిషన్ నియమించాలి. తెలంగాణ వారు తెలంగాణలో, సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో పనిచేసే విధంగా నిబంధనలు సరళతరం చేయాలి. వీటిపై దృష్టి సారించకపోతే మరిన్ని ఉద్యమాలు ఏర్పడే ప్రమాదముంది.
(వ్యాసకర్త సహాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం)
మొబైల్: 98661 74474
కాలేరు సురేష్