Distribution of employees
-
నచ్చిన చోటుకు వెళ్లొచ్చు.. నెలాఖరులోగా కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. తొలుత కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. మిగతా జిల్లాల్లో ఈ నెల 16 తర్వాత ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి.. కొత్త జిల్లాల మధ్య పోస్టులను విభజించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీచేయనుంది. ఇక ఉపాధ్యాయుల విభజనకు సంబంధించి మరో సమావేశం నిర్వహించాక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలిసింది. తొలుత జిల్లా స్థాయిలో.. : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలకు అనుగుణంగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కొత్త జోనల్ విధానానికి కొద్దినెలల కిందే రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్ల వారీగా ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏయే పోస్టులు ఏయే కేడర్ల కిందకు వస్తాయన్నది ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడుతోంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం బీఆర్కేఆర్ భవన్లో టీజీవో, టీఎన్జీవోల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. ఉద్యోగులందరి నుంచి కేడర్ల వారీగా ఆప్షన్లు స్వీకరించి.. కొత్త జిల్లాలకు కేటాయిస్తామని ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు సమయంలో.. టీజీవో, టీఎన్జీవోలతోపాటు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన జిల్లాస్థాయి ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా కమిటీలతో.. జిల్లా కేడర్ పోస్టులు, ఉద్యోగుల విభజనను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనుంది. వీటికి ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్ నేతృత్వం వహిస్తారు, ఇతర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో సదరు కమిటీ పోస్టులు, ఉద్యోగుల విభజనను చేపడుతుంది. ఇక కొత్త జిల్లాల మధ్య ఉపాధ్యాయల విభజన, బదిలీలపై ప్రభుత్వం త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. మరోవైపు జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల విభజనపై ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమై చర్చలు జరుపుతామని ఉద్యోగ నేతలు వెల్లడించారు. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో జీఎడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఆర్థికశాఖ కన్సల్టెంట్ శివశంకర్‌లతో రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన కమిటీ.. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనను పర్యవేక్షించనుంది. ఆదివారం సీఎస్‌తో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, రోనాల్డ్ రోస్, సీఎం ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, టీఎన్జీవోల కార్యదర్శి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, టీజీవోల కార్యదర్శి సత్యనారాయణ, సహాధ్యక్షుడు సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికత, సీనియారిటీకి నష్టం జరగకుండా.. కొత్త జిల్లాల ప్రకారం కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియలో.. ఉద్యోగుల స్థానికత, సీనియారిటీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. సీఎస్‌తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాల ఉద్యోగులు.. సదరు ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పాటైన కొత్త జిల్లాలకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించాలని సీఎస్‌ను కోరామని.. ఆయన సానుకూలంగా స్పందించారని రాజేందర్ చెప్పారు. ఈ ప్రక్రియకు సంబంధించి తాము పలు సూచనలు, సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఆ సూచనలు, సలహాలివీ.. కొత్త జిల్లాలో ఒకే పోస్టు ఉండి ఇద్దరు ఉద్యోగులు తొలి ఆప్షన్ ఇచ్చి ఉంటే.. సీనియారిటీ ప్రాతిపదికన ఆ పోస్టును ఉద్యోగికి కేటాయించాలి. మరో ఉద్యోగిని అతడి రెండో ఆప్షన్ జిల్లాకు కేటాయించాలి. వరంగల్ ఉమ్మడి జిల్లాను ఏడు కొత్త జిల్లాలుగా విభజించినందున.. ప్రాధాన్యత క్రమంలో ఏడు ఆప్షన్లు ఇచ్చేందుకు అక్కడి ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. భార్యభర్తల్లో ఎవరు కోరుకుంటే వారిని తమ జీవిత భాగస్వామి పనిచేసే జిల్లాకు బదిలీ చేయాలి. రాష్ట్ర విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గందరగోళంగా ఉద్యోగుల విభజన చేశారు. ఈసారి అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. పెద్ద, చిన్న జిల్లాలకు సమాన సంఖ్యలో పోస్టులు ఇస్తే ఉద్యోగులు నష్టపోతారు. జనాభా ప్రాతిపదికన పోస్టుల విభజన చేయాలి. ఉద్యోగులు సీనియారిటీ నష్టపోకుండా కొత్త జిల్లాల్లో అవసరమైన మేరకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలి. జాప్యాన్ని నివారించడానికి జిల్లాస్థాయి పోస్టులను శాఖాపర నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయాలి. ఒకేసారి అన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు రోస్టర్ విధానం పాటించాలి. విభజనకు సహకరిస్తాం డిసెంబర్ నెలాఖరులోగా ఉద్యోగుల నుంచి ఆఫ్‌లైన్‌లో ఆప్షన్లు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియకు ఎలాంటి భేషజాలు లేకుండా ఉద్యోగులంతా సహకరిస్తాం. ఉద్యోగాల నోటిఫికేషన్లపై త్వరలోనే సీఎం కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు. – టీజీవోల అధ్యక్షురాలు మమత ఖాళీ పోస్టులపై త్వరలోనే స్పష్టత! కొత్త జిల్లాల వారీగా పోస్టులు, ఉద్యోగుల విభజన పూర్తయితే.. ఖాళీ పోస్టుల సంఖ్య ఎంత, ఏయే పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ప్రస్తుతం 85వేల నుంచి లక్ష వరకు కొలువులు ఖాళీగా ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ లెక్క తేలాక పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. -
ఏపీ, తెలంగాణలపై ‘ధిక్కార’ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ, ఏపీ ప్రభు త్వాలు అక్కడి విద్యుత్ సంస్థలు అమలు చేయడం లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయడానికి వీల్లేదని, 2 నెలల్లో ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించడం గానీ లేదా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలన్న తీర్పును పట్టించుకోవడం లేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.దీనిని కోర్టు ధిక్కారం కింద పరిగణించాలంటూ టీఎస్ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ జి.రఘుమారెడ్డి, ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ ఎండీ ఎంఎం.నాయక్, ఏపీ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్లను ప్రతివాదులుగా పేర్కొ న్నారు. దీనిపై వచ్చే వారం హైకోర్టు విచారణ జరిపే అవకాశముంది. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఉద్యోగుల విభజన చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వం లోని ధర్మాసనం.. ఏపీ స్థానికత ఆధారంగా విభజన చెల్లదంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించడం గానీ లేదా కొత్త కమిటీని, కమిటీలను ఏర్పాటు చేయడంగానీ చేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం, ఏపీ విద్యుత్ సంస్థ లు, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలంది. ఈ జాయింట్ కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజనను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇప్పటికే రిలీవ్ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా.. వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని విద్యుత్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో టీఎస్ఎస్పీడీసీ ఎల్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీలో ఉద్యోగానికి భలే క్రేజ్
పదవీ విరమణ వయస్సు పెంచడమే కారణం హైదరాబాద్: రాష్ర్టస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఏపీప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడమే ఇందుకు కారణం. అదనంగా రెండేళ్లపాటు ఉద్యోగం చేయొచ్చనే ఆలోచనతో తెలంగాణకు చెందిన 1,141 మంది ఏపీకి ఆప్షన్లు ఇచ్చారు. ఈ ఆప్షన్ల ఆధారంగా తెలంగాణకు చెందిన 1,141 మందిని కమలనాథన్ కమిటీ ఏపీకి పంపిణీ చేసింది. ఇప్పటివరకు 113 విభాగాలకు చెందిన 16,930 మందిని ఇరు రాష్ట్రాలకు తాత్కాలికంగా పంపిణీ చేసింది. ఉద్యోగుల స్థానికతను పరిశీలిస్తే తెలంగాణకు చెందిన 1,260 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. ఏపీకి చెందిన 564 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారు. ఏపీకి ఇప్పటి వరకు కేటాయించిన ఉద్యోగుల్లో 53 మంది రెండు రాష్ట్రాలకు ఆప్షన్లు ఇచ్చారు. అలాగే ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వని 262 మందిని ఏపీకి కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల్లో 39 మంది రెండు రాష్ట్రాలకు అప్షన్లు ఇవ్వగా.. ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగులు 207 మంది ఉన్నారు. -
ఉద్యోగుల విషయం తేలాకే ఆస్తుల పంపిణీ
తొలుత జనాభా నిష్పత్తి మేరకు ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలి * తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది * కేంద్రానికీ, షీలాభిడే కమిటీకి ఏపీ సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో గల ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పంపిణీ పూర్తి అయ్యే వరకు ఆ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్నీ, షీలాభిడే కమిటీని కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో గల 90 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసే నిమిత్తం షీలాభిడే కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షీలాభిడే కమిటీ దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీని ఒక కొలిక్కి తీసుకువచ్చింది. అయితే ఈ విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య ఏకాభిప్రాయం లేదు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ సర్కారు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆ లేఖలో ఏపీ సీఎస్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను, కేంద్ర సూచనలను టీ సర్కారు అమలు చేయకపోవడంతో 1,253 మంది ఉద్యోగుల కుటుం బాలు వీధిన పడ్డాయన్నారు. అప్పులు, ఆస్తుల పంపిణీ పూర్తి కాగానే ఆయా సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయాలనే వ్యూహాన్ని టీ సర్కారు అనుసరిస్తోందని ఏపీ సీఎస్ ఆరోపించారు. ఈ వ్యూహంలో భాగంగానే టీ సర్కారు షీలాభిడే కమిటీ నివేదికను అంగీకరించిందని వివరించారు. అయితే ఉద్యోగులను జనాభా నిష్పత్తి మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు పంపిణీ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ సర్కారు అంగీకరించడం లేదన్నారు. ఆస్తులు, అప్పుల పంపిణీని ఉద్యోగుల పంపిణీని వేర్వేరుగా చూడరాదని ఏపీ సీఎస్ పేర్కొన్నారు. -
స్థానికత ఆధారంగానే విభజన
ఉద్యోగుల పంపిణీలో మరో విధానం వద్దని కేంద్రానికి స్పష్టం చేశాం: సీఎస్ రాజీవ్ శర్మ సాక్షి, న్యూఢిల్లీ: స్థానికతను ఆధారంగా చేసుకునే ఉద్యోగుల విభజన జరగాలని కేంద్ర హోంశాఖకు స్పష్టం చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు. దీనికి మరో పద్ధతేదీ పెట్టుకోవద్దని కోరామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్లకు సంబంధించి ఉద్యోగుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్‌శర్మ ఉద్యోగుల ఇరు ప్రభుత్వాల వైఖరులను తెలియచేశారు. అనంతరం రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడారు. 9వ షెడ్యూల్లోని ఉద్యోగుల విభజనతో పాటు ప్రత్యేకంగా విద్యుత్ ఉద్యోగుల అంశంపై చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ‘‘తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన చేయాలి. వేరే పద్ధతి పెట్టుకోవద్దని చెప్పాం. ఇక విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉంది. మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు కూడా చేశాం. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోం..’’ అని వెల్లడించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయల్ సూచించారని చెప్పారు. కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున కమిటీ ఏర్పాటు సహా మరే ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెప్పామన్నారు. కాగా సమావేశంలో ఏపీ తరఫున ఏం చెప్పారనే దానిపై ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావును ప్రశ్నించగా...వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. -
‘పునర్విభజన’ వివాదాలపై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. చట్టంలోని నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవాలని గతంలోనే కేంద్రం సూచించింది. దీనిని రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోకుండా తలో దారిలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థల విభజనతో పాటు వాటిలో పనిచేసే ఉద్యోగుల పంపిణీలో వివాదాలకు న్యాయస్థానం ద్వారా తెరదించాలని కేంద్రం భావిస్తోంది. ఇంటర్మీడియెట్ బోర్డు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున షెడ్యూల్ 9, 10లో సంస్థల అంశాలనూ అదే న్యాయస్థానం ముందుంచాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలను జారీ చేయించిన పక్షంలో రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి వస్తుందనే కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడగా ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. షెడ్యూల్ 9లో 89 సంస్థలున్నాయి. ఈ సంస్థల నిధులు, ఉద్యోగుల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా నిష్పత్తి మేరకు ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంస్థల పంపిణీకి జనాభా నిష్పత్తి ప్రకారం అంగీకరిస్తోంది. కొన్ని సంస్థలకు ససేమిరా అంటోంది. అలాగే ఈ సంస్థల్లో ఉద్యోగుల పంపిణీని స్థానికత ఆధారంగా చేయాలని టీ సర్కారు పట్టుపడుతుండగా జనాభా నిష్పత్తి ప్రకారమే జరగాలని ఏపీ ప్రభుత్వం పట్టుపడుతోంది. షెడ్యూల్ 10లో 107 సంస్థలుండగా అదనంగా మరో 35 సంస్థలను కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ సంస్థలకు చెందిన నిధులు, ఉద్యోగుల పంపిణీలోనూ వివాదాలు నెలకొన్నాయి. కొన్ని సంస్థలను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, మరి కొన్ని సంస్థల్లోని నిధులను స్తంభింప చేసింది. ఈ సంస్థలన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున ఇవన్నీ తెలంగాణకే చెందుతాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ సంస్థల ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడంతో పాటు కొత్తగా ఈ సంస్థలను తాము ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపైనా కేంద్రం చేతులెత్తేసింది. ఈ వివాదాలన్నింటినీ న్యాయస్థానం ముందుకు తీసుకువెళ్లి పరిష్కరింప చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. -
మరో ‘కమిటీ’ని నియమించాలి
సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న తర్వాత ఇక్కడి ఉద్యో గులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే భావనతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గా లన్నీ కలసి పోరాటం చేశా యి. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా తెలం గాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతోంది. విభజన బిల్లులో ఉద్యోగుల, పెన్షనర్ల విభజనలో జిల్లా జోన్, మల్టీ జోనల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కడివారు అక్కడే ఉంటారనే ప్రతిపా దనతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోం ది. పార్లమెంటు చట్టం రాష్ట్ర విభజన ఆస్తులు, అప్పు లతోపాటు ఉద్యోగుల పంపిణీ 58:42 నిష్పత్తి ప్రకా రం జరగాలన్నది చెబుతుంది. కానీ ఉద్యోగుల విభ జనలో ఈ సూత్రం పనిచెయ్యదు. కమల్‌నాథన్ కమిటీ/షీలాబిడే కమిటీలు కేవలం ఉన్న ఉద్యోగుల ను 58:42 శాతం విభజించడానికే పరిమితం అవు తున్నాయి. అన్ని క్యాడర్లలో 42 శాతం మంది తెలం గాణ ఉద్యోగులు లేరన్నది వాస్తవం. కానీ తెలంగా ణకు కేటాయించే 42 శాతంలో కూడా నిజమైన తెలంగాణ వాళ్లు ఉండరనేది తెలంగాణ ఉద్యోగుల వాదన. సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విభజన జరుగు తున్నది కేవలం సచివాలయం హెచ్ఓడీలలో మా త్రమే. కానీ అసలు సమస్య జిల్లాలో ఉన్న స్థానికేత రులతోనే! వారిని పంపించకుండా కేవలం రాష్ట్ర స్థాయిలో విభజనను చేపట్టడం వలన, ఉల్లంఘన తో దొడ్డిదారిలో వచ్చిన స్థానికేతరులను స్థానికు లుగా గుర్తించడమే అవుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయిలో 20 శాతం, జోనల్ స్థాయిలో 30 శాతంగా ఉన్న ఓపెన్ కోటాలో కేవలం స్థానికేతరులకు అవకాశాలు ఇవ్వ డంవల్ల తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యా యం జరిగిందని గిర్‌గ్లానితో పాటు అనేక కమిటీలు స్పష్టంగా పేర్కొన్నాయి. పదవ తరగతి వరకు వరు సగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ వ్యక్తిని స్థానికు డిగా పరిగణించడమనే నిబంధన తెలంగాణ నిరు ద్యోగులకు గొడ్డలిపెట్టు. సమైక్య రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉద్యోగాలు చేసిన ఉద్యోగులు, వ్యాపారం పేరిట ఇక్కడకు వచ్చిన వారు, వారి పిల్లలు, అందరూ స్థానికులైతే తెలం గాణ భూమిపుత్రులకు నోట్లో మట్టే. 1956 నుంచి తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అన్యాయాల పట్ల నిరుద్యోగులు పోరాటాలు చేస్తూ నే ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసు కొన్న ప్రభుత్వమే ఈ విషయంలో చొరవ తీసుకో వాలి. హెల్త్ కార్డులు, పీఆర్సీలు, ఫిట్మెంట్లు కాదు. ముందుగా విభజనపై దృష్టి సారించాలి. పార్లమెంటు చట్టంలో మార్పులకై పట్టుబట్టాలి. స్థానికేతరులు ఉద్యోగాల్లో చొరబడకుండా కట్టుది ట్టంగా వ్యవహరించాలి. కచ్చితమైన క్యాడర్ స్ట్రెంత్ ను ఏర్పాటు చేసుకుంటూ తెలంగాణ ప్రమోషన్లు, డీపీసీలు ఏర్పాటు చేసి ఖాళీలను పూరించాలి. కమలనాథన్ కమిటీ పనిచేసే తీరులోనే అశా స్త్రీయ ధోరణులు కనబడుతున్నాయి. సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని రాష్ట్ర స్థాయిగా గుర్తించి జనాభా దామా షాలో 58.32 శాతం సీమాంధ్రకు, 41.68 శాతం తెలంగాణకు కేటాయింపులు చేస్తున్నారు. మొదట ఖాళీలను, తదుపరి వ్యక్తులను పంచుతున్నారు. అస లు (క్యాడర్ స్ట్రెంత్)ను మంజూరు అయిన పోస్టు లను పక్కనబెట్టి కేవలం పనిచేస్తున్న వారిని (వర్కిం గ్ స్ట్రెంత్)ను విభజించడం వల్ల తెలంగాణ ఉద్యోగు లు ఆంధ్రలో, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పని చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయి అధికారు లను జిల్లా, జోనల్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగు లను ‘ఎక్కడ వారిని అక్కడే’ ఉంచడం వల్ల సీమాం ధ్రలో కొందరు తెలంగాణ ఉద్యోగులు, తెలంగా ణలో వేలాది మంది ఉద్యోగులు చట్టబద్ధంగా ఉండి పోయే పరిస్థితి వస్తుంది. కలమనాథన్, షిలాబిడే కమిటీలతో పాటు అవసరమైతే రాజ్యాంగబద్ధత కలిగిన మరో కమిషన్ నియమించాలి. తెలంగాణ వారు తెలంగాణలో, సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో పనిచేసే విధంగా నిబంధనలు సరళతరం చేయాలి. వీటిపై దృష్టి సారించకపోతే మరిన్ని ఉద్యమాలు ఏర్పడే ప్రమాదముంది. (వ్యాసకర్త సహాధ్యక్షులు, తెలంగాణ ఉద్యోగుల సంఘం) మొబైల్: 98661 74474 కాలేరు సురేష్ -
నేటి నుంచి ఆప్షన్లు
-
నేటి నుంచి ఆప్షన్లు
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధం 35 శాఖల ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనున్న కమలనాథన్ కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను పంపిణీ చేయగానే ఆ పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ అధ్యక్షతన గల రాష్ట్ర సలహా కమిటీ చేపట్టనుంది. ఇప్పటికే రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 67 శాఖలకు చెందిన వివరాలను కమలనాథన్ కమిటీ నోటిఫై చేసింది. 35 శాఖల పోస్టుల పంపిణీపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఈ శాఖల్లోని పోస్టులకు చెందిన ఉద్యోగులు ఇప్పటికే ఫామ్-3లో అన్ని వివరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఈ 35 శాఖలకు చెందిన రాష్ర్ట స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఆప్షన్లను తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఆన్లైన్లో ఉన్న ఆప్షన్ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను నింపి ఇవ్వాల్సిందిగా ఆయా ఉద్యోగుల సెల్ నంబర్లకు ఎస్ఎంఎస్లను పంపనున్నారు. ఆప్షన్లు ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వనున్నారు. విభజన చట్టంలోని మార్గదర్శకాల మేరకు ఏ రాష్ట్ర్రానికైనా కేటాయించవచ్చునని స్పష్టం చేశారు. ఆప్షన్ పత్రంలో పేర్కొన్న ముఖ్యాంశాలు.. - ఏ శాఖలో పనిచేస్తున్నారు. ఏ ప్రభుత్వానికి చెందిన ఏ కేటగిరీ పోస్టులో ఉన్నారు. - ఏ సర్వీసుకు చెందిన ఉద్యోగి. శాఖ యూనిట్ పేరు. ఏ కేటిగిరీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి. - సర్వీసు రిజిస్టర్ ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగి గుర్తింపు నంబర్ - పుట్టిన తేదీ, పుట్టిన ప్రాంతం/గ్రామం, పట్టణం, జిల్లా పేరు. - సొంత జిల్లా. - సామాజిక హోదా: ఎస్సీ/ ఎస్టీ,/బీసీ/ ఇతర. వివాహం అయిందా లేదా? - ప్రభుత్వ సర్వీసులో చేరిన సంవత్సరం - తొలి పోస్టింగ్ హోదా. ప్రాంతం - 1975 ప్రభుత్వ ఉద్యోగుల సంబంధిత ఉత్తర్వుల (రాష్ట్రపతి ఉత్తర్వులు) ప్రకారం స్థానికుడైతే.. ఏ ప్రాంతం, ప్రస్తుతం ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది. ఉద్యోగంలో చేరడానికి అర్హత పరీక్షకు ముందు ఏడేళ్లు ఎక్కడ, ఏ విద్యా సంస్థలో చదివారు?/ టెన్త్‌కు ముందు ఏడేళ్లు ఏ విద్యా సంస్థలో, ఎక్కడ చదివారు? - సంబంధిత ఉద్యోగానికి ఎటువంటి విద్యార్హత లేని పోస్టుల్లో పనిచేస్తున్న వారు ఆ పోస్టు నోటిఫికేషన్ తేదీకి ముందు ఏడేళ్లు ఎక్కడ నివాసం ఉన్నారో తెలియజేయాలి. చదివిన సర్టిఫికెట్ లేదా నివాస స్థలం సర్టిఫికెట్ జత చేయాలి. - తొలి పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో తెలియజేసే ధ్రువీకరణ/ ఆ పోస్టు ప్రస్తుతం ఉందా? - ఆఫీస్ చిరునామా - ప్రస్తుతం ఉన్న పోస్టులో నియామకానికి అనుసరించిన విధానం డెరైక్ట్ రిక్రూట్మెంట్/ పదోన్నతి/ బదిలీ. - ప్రస్తుతం ఉన్న పోస్టులో రెగ్యులర్ నియామకమా/తాత్కాలిక నియామకమా/ఇన్‌చార్జా? - ప్రస్తుతం చేస్తున్న పోస్టు మీ స్థాయికి తగినట్లు ఉందా. - ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకు కాలపరిమిత ఉందా/డెప్యుటేషన్/సెలవు/సస్పెన్షన్.. సంబంధిత వివరాలు. - ఏ రాష్ట్రానికి కేటాయించాలని కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ. అందుకు గల కారణాలు. -
పదో షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగుల పంపిణీకి కమిటీ
* ఆంధ్రా నుంచి ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ నుంచి రామకృష్ణారావు * 22 శాఖలు, 15 రాజ్యాంగ సంస్థల సిబ్బంది పంపిణీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లో ఉన్న 22 శాఖలు, 15 రాజ్యాంగ సంస్థల ఉద్యోగుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఓ కమిటీని నియమించాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ, రాష్ట్ర ఫునర్విభజన విభాగం కార్యదర్శి ఎల్. ప్రేమచంద్రారెడ్డి, తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పదో షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగుల పంపిణీ తన పరిధిలోకి రాదని కమలనాథన్ కమిటీ తెలిపింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐ.వై.ఆర్.కృష్ణారావు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పోలీసు, వ్యవసాయం, పశుసంవర్థక, విద్యా శాఖ, సంక్షేమ శాఖల్లోని పోస్టులు, ఉద్యోగులను వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయింది. కమలనాథన్ మార్గదర్శకాలతో 9 వ షెడ్యూల్లోని ఉద్యోగుల పంపిణీ చేయండి కమలనాధన్ కమిటీ మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థల ఉద్యోగుల పంపిణీని చేయాలని ఆ సంస్థల విభజనపై ఏర్పాటైన షీలా బిడే కమిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు లేఖ రాశారు. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ కూడా ఇదే తరహా లేఖను షీలా బిడే కమిటీకి రాయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పే అండ్ అకౌంట్లో ఎక్కువ పోస్టులు కోరుతున్న తెలంగాణ పే అండ్ అకౌంట్ ఆఫీస్‌లోని పోస్టుల్లో ఎక్కువ తెలంగాణకు కావాలని తెలంగాణ పే అండ్ అకౌంట్ అధికారులు కోరుతున్నారు. అలాగే సెరికల్చర్, ఉద్యానవన విభాగాల్లో కూడా ఎక్కువ పోస్టుల కావాలని కోరుతున్నారు. దీనిపై కమలనాథన్ కమిటీ స్పందిస్తూ ఇరు రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల అధికారులు అంగీకరిస్తేనే ఒక రాష్ట్రానికి ఎక్కువ, ఒక రాష్ట్రానికి తక్కువ పోస్టులు కేటాయిస్తామని చెప్పింది. ఇరు రాష్ట్రాలు అంగీకరించకపోతే జనాభా ప్రాతిపదికనే పోస్టులు, ఉద్యోగుల పంపిణీ చేస్తామని స్పష్టంచేసింది. పోస్టులు, ఉద్యోగుల పంపిణీపై 28న ఢిల్లీలో సమావేశం రాష్ట్రస్థాయి కేడర్ పోస్టులు, ఉద్యోగుల పంపిణీపై ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను వివరించేందుకు ఈ నెల 28నఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లాలని కమలనాథన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా పాల్గొంటారు. -
ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల జారీలో జాప్యం
తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ దగ్గరే ఫైలు పెండింగ్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాల జారీలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఫైలు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో సంప్రదించిన తరువాత క్లియర్ చేయాల్సి ఉంది. కేసీఆర్ గత మూడు రోజుల నుంచి ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో రాజీవ్ శర్మ ఈ అంశంపై చర్చించలేకపోయారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై కమలనాథన్ గురువారం సచివాలయానికి వచ్చి తెలంగాణ సీఎస్‌తో చర్చించారు. శుక్రవారం రాజీవ్ శర్మ నుంచి ఫైలు క్లియర్ అవుతుందని కమలనాథన్ భావించారు. అయితే రాజీవ్ శర్మ ఫైలు క్లియర్ చేయలేదు. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడం, సోమవారం రాజీవ్ శర్మ ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశానికి వెళ్లనుండడంతో మంగళవారం గానీ ముసాయిదా మార్గదర్శకాలకు మోక్షం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
రేపే కమలనాథన్ ముసాయిదా మార్గదర్శకాలు
అందరినీ ఆప్షన్లు అడిగినా వాటిని సరిగణనలోకి తీసుకోవాలని లేదు వెబ్సైట్లో ముసాయిదా మార్గదర్శకాలు.. అభ్యంతరాలకు 10 రోజుల సమయం హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకీ లకమైన ముసాయిదా మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ శుక్రవారం విడుదల చేయనుంది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఖరారు చేసిన ఈ ముసాయిదా మార్గదర్శకాలను కమిటీలోని అధికారుల సంతకాల కోసం పంపారు. శుక్రవారంనాటికల్లా సంతకాలు పూర్తవుతాయని, అదే రోజు సాయంత్రానికి ముసాయిదా మార్గదర్శకాలు విడుదలవుతాయని, వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లలో ఉంచుతారని అధికారవర్గాలు తెలిపాయి. వాటిపై అభ్యం తరాలు, సలహాల కోసం పది రోజుల సమయం ఇస్తారు. ఉద్యోగుల శాశ్వత పంపిణీ కార్యాక్రమాన్ని ఎనిమిది నెలల్లోగా పూర్తి చేయాలని కమలనాథన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముసాయిదా మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. రాబోయే రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాలి రాష్ట్ర కేడర్‌కు చెందిన 51 వేల మంది ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు. కొన్ని రంగాలకు చెందిన వారి ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకుంటారు. పదవీ విరమణ చేయబోతున్న, నిర్ధారించిన వ్యాధులతో బాధపడుతున్న వారు, భార్య-భర్త ఇద్దరూ ఉద్యోగులైతే, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు గల వారి ఆప్షన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మిగతా వారందరినీ ఆప్షన్లు అడిగినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఏదీ చట్టంలో లేదు. ఆప్షన్లు తీసుకోవాలనే నిబంధన మాత్రమే ఉంది. తొలుత కేటగిరీవారీగా కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు పోస్టుల సంఖ్యను పంపిణీ చేస్తుంది. ఖాళీలతో సహా జనాభా నిష్పత్తి ప్రాతిపదికన పోస్టుల పంపిణీ జరుగుతుంది. ఆతర్వాత తొలుత స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయిస్తుంది. ఈ కేటాయింపుల్లో ఏదైనా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన ఉద్యోగులకన్నా ఇద్దరు ఎక్కువగా ఉండి.. అదే కేటగిరీలో తెలంగాణలో అవసరమైన దానికన్నా ఇద్దరు ఉద్యోగులు తక్కువగా ఉంటే ఆప్షన్లు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆంధ్రాలో ఎక్కువున్న ఉద్యోగులు ఇద్దరినీ తెలంగాణకు కేటాయిస్తారు. ఈ విధంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయిన తరువాత ఏ ప్రభుత్వంలో ఎక్కడి వారు ఎంత మంది ఉన్నారో తేలుతుంది. దాని ఆధారంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్‌న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేసుకొని, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను అదే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. -
సీఎస్ లతో కమలనాథన్ కమిటీ సమావేశం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల విభజన అంశంపై కమలనాథన్ కమిటీ గురువారం సచివాలయంఓ భేటీ అయ్యింది. ఉద్యోగుల శాశ్వత విభజన మార్గదర్శకాలపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి కేంద్ర కార్యదర్శి అర్చనా వర్మ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరయ్యారు. అలాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. -
ఉద్యోగుల విభజనపై మోడీ ఆరా!
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియపై కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీసినట్టు తెలిసింది. దీనిపై రెండు రోజుల కిందటే కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ సేథ్, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. ఉద్యోగుల విభ జనకు సంబంధించి తీసుకుంటున్న ప్రాతిపాదిక ఏమిటి? ఉద్యోగుల పంపిణీపై ఆయా సంఘాల మనోభీష్టం ఎలా ఉంది, గతంలో ఉద్యోగుల విభజన ఎలా జరిగింది అన్న అంశాలపై మోడీ వారిని అడిగినట్లు తెలిసింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై చేస్తున్న కసరత్తు, ఉద్యోగుల విభజనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఉద్యోగుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను తనకు అందజేయాలని మోడీ వారికి సూచించినట్లు తెలిసింది. -
కమలనాథన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు
ఉద్యోగుల పంపిణీపై ఏకాభిప్రాయానికి రాని సభ్యులు ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి తొలుత పంపేయాలన్న మెజారిటీ సభ్యులు ముందే ఆప్షన్లు ఇవ్వాలన్న మరో సభ్యుడు ఏ అభిప్రాయం చెప్పని కమలనాథన్, అర్చన వర్మ హైదరాబాద్: రాష్ట్ర విభజన మాటెలా ఉన్నా, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీలో ఏకాభిప్రాయం కొరవడింది. కమిటీ శుక్రవారం సమావేశమై ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై విస్త్రృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు పి.వి.రమేశ్, నాగిరెడ్డి, జయేశ్ రంజన్, కేంద్ర అధికారి అర్చన వర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి ప్రొవిజనల్ జాబితా ప్రకారం కేటాయిద్దామని, జూన్ 2న కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఆప్షన్ల విధానాన్ని అమలు చేద్దామని కమిటీలోని మెజారిటీ సభ్యులు చెప్పారు. మరో సభ్యుడు మాత్రం ఇప్పుడే ఆప్షన్లు ఇవ్వాలని అన్నారు. కొత్త ప్రభుత్వాలు, కొత్త ముఖ్యమంత్రులు వచ్చాక పూర్తి రాజకీయం అవుతుందని, అప్పుడు ఆప్షన్లు అంటే సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కమిటీ చైర్మన్ కమలనాథన్ మాత్రం ఎటువంటి అభిప్రాయం వ్యక్తంచేయలేదు. కమిటీలోని మరో సభ్యురాలు, కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మకు రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ, మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కమలనాథన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 (1), 76 (2)లో తొలుత జూన్ 2కన్నా ముందుగానే తెలంగాణ ఉద్యోగులను కేటాయించాలని ఉంది. దీనిప్రకారం స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతం వారిని తెలంగాణకు, సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
610 ఉద్యోగుల స్థానికతకు జీవోనే ప్రామాణికం!
* 4 నుంచి 10వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికత * గవర్నర్‌తో కమలనాథన్ * కమిటీ భేటీ.. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ హాజరు * నేడు ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు.. కేంద్రానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీలో స్థానికతకు 610 జీవోను ప్రామాణికంగా తీసుకోవాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఈ జీవో ప్రకారం 4వ తరగ తి నుంచి 10వ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అదే స్థానికతగా పరిగణిస్తారు. కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటివారంలో అధికారికంగా విడుదల చేయనుంది. కమలనాథన్ కమిటీ గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నర్సింహన్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో విభజనకు సంబంధించి కేంద్ర మంత్రివర్గ ఉప కమిటీలో సభ్యుడైన మంత్రి జైరాం రమేశ్, సీఎస్ మహంతి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, ఎన్నికల ముందు ఉద్యోగుల పంపిణీకి అనుసరించే విధానాన్ని ప్రకటిస్తే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాలతో ఎటువంటి వివాదాలు తెచ్చుకోకూడదనే అభిప్రాయంతో కమలనాథన్ ఉన్నారు. మార్గదర్శకాలు కూడా ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను జిల్లాల నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఆ తరువాత స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి పంపిణీ చేస్తారు. ఇదంతా తాత్కాలికంగానే (ప్రొవిజనల్) జరగాలని, ఉద్యోగుల తుది పంపిణీ అనేది ఎన్నికల అనంతరం ఎన్నికైన రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకనే చేయాలనేది కమలనాథన్ అభిప్రాయమని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మరోపక్క మార్గదర్శకాల ముసాయిదాను ఖరారు చేసేందుకు శుక్రవారం కమలనాథన్ కమిటీ సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రూపొందించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ ముసాయిదా మార్గదర్శకాలు న్యాయపరంగా, చట్టబద్ధంగా ఉన్నాయో లేవో కేంద్రం పరిశీలించనుంది. ఆ తర్వాత వాటిని వచ్చే నెల మొదటివారంలో అధికారికంగా విడుదల చేస్తుందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
ప్రజాభిప్రాయం ప్రకారమే ఉద్యోగుల ‘విభజన’
పంపిణీ మార్గదర్శకాలపై వినతులకు కమల్‌నాథన్ ఆహ్వానం సలహాలు, సూచనల తర్వాతే తుది మార్గదర్శకాలు ఖరారు జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగుల పంపిణీ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్‌నాథన్... ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. సచివాలయంలోని సి-బ్లాక్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయన ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శకాలే కీలకం. ఆ మేరకే ఉద్యోగులను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఈ మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా కమల్‌నాథన్ ఇప్పటికే రెండ్రోజుల పాటు ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారి అభిప్రాయాలను తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆయా సంఘాల నుంచి నోట్లను తీసుకున్నారు. ఇంకా ఎవరైనా, ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగ సంఘాలైనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగులు కానీ తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించడానికి కమల్‌నాథన్ అనుమతించారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలకు వారం రోజుల్లోగా ఒక రూపం ఇచ్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. మరోసారి మార్గదర్శకాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం అభిప్రాయాలను తీసుకోనున్నారు. తొలుత ముసాయిదా మార్గదర్శకాలను ప్రజల ముందు ఉంచి... వారి సలహాలు, సూచనలు స్వీకరించడానికి తగిన గడువు ఇవ్వాలని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర వర్గాల నుంచి వచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే తుది మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉద్యోగుల పంపిణీ ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. దీంతో గతంలో రాష్ట్రాల విభజనలో పాటించినట్లే ఇప్పుడు కూడా జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ చేయాలనే ఆలోచనలో కమల్‌నాథన్ ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగుల పంపిణీలో కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అనుసరించనున్న కీలకాంశాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ప్రొవిజినల్ ఉద్యోగుల కేటాయింపును జూన్ 2వ తేదీ కన్నా ముందుగానే కేంద్రం పూర్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగుల కేటాయింపును ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటూ జూన్ 2 తర్వాత కేంద్రం చేస్తుంది. స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్న వారు ఆ రాష్ట్రంలోనే ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రస్థాయి కేడర్‌లోని అధికారులు జోనల్, జిల్లా, డివిజినల్, మున్సిపల్, మండలస్థాయిలో పనిచేస్తున్న వారిని రాష్ట్రంలో ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర సలహా కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలకు రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ అధికారం కేంద్రానికి ఉంది.