కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియపై కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీసినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియపై కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీసినట్టు తెలిసింది. దీనిపై రెండు రోజుల కిందటే కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ సేథ్, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడినట్టు సమాచారం. ఉద్యోగుల విభ జనకు సంబంధించి తీసుకుంటున్న ప్రాతిపాదిక ఏమిటి?
ఉద్యోగుల పంపిణీపై ఆయా సంఘాల మనోభీష్టం ఎలా ఉంది, గతంలో ఉద్యోగుల విభజన ఎలా జరిగింది అన్న అంశాలపై మోడీ వారిని అడిగినట్లు తెలిసింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై చేస్తున్న కసరత్తు, ఉద్యోగుల విభజనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఉద్యోగుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను తనకు అందజేయాలని మోడీ వారికి సూచించినట్లు తెలిసింది.