
గ్రహం అనుగ్రహం, శుక్రవారం 26, జూన్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,
అధిక ఆషాఢ మాసం, తిథి శు.దశమి పూర్తి,
నక్షత్రం చిత్త రా.10.54 వరకు,
వర్జ్యం ఉ.5.24 నుంచి 7.09 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 9.01 వరకు,
తదుపరి ప.12.29 నుంచి 1.20 వరకు,
అమృతఘడియలు ప.2.00 నుంచి 3.39
సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుంచి 4.30 వరకు
భవిష్యం
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్ర లాభాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మిథునం: పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు.
సింహం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి.
కన్య: కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు రావచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు నెలకొంటాయి.
తుల: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాలు రేగుతాయి. ఆరోగ్య భంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మరింత పనిభారం.
ధనుస్సు: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. విందు వినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది.
మకరం: విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. విందు వినోదాలు. కార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. నిర్ణయాలలో ఆటంకాలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్పులుండొచ్చు. ధనవ్యయం. అనారోగ్యం. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
- సింహంభట్ల సుబ్బారావు