
గ్రహం అనుగ్రహం, బుధవారం 17, జూన్ 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక ఆషాఢమాసం
తిథి శు.పాడ్యమి రా.6.45 వరకు
నక్షత్రం మృగశిర ఉ.6.00 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం ప.2.33 నుంచి 4.09 వరకు
దుర్ముహూర్తం ప.11.36 నుంచి 12.27 వరకు
అమృతఘడియలు రా.8.14 నుంచి 9.53 వరకు
భవిష్యం
మేషం: వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.
వృషభం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటుంది.
మిథునం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఇంటా బయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. నిర్ణయాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
సింహం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కన్య: ఇంటర్వ్యూలు అందుతాయి. కార్య జయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి.
తుల: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం.
వృశ్చికం: వ్యయప్రయాసలు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో నిరుత్సాహం. ఉద్యోగులకు మార్పులు.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణ ఒత్తిడులు తొలగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.
మకరం: పనులలో విజయం సాధిస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు లాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి.
కుంభం: కొత్తగా రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: పనుల్లో ఆటంకాలు వస్తాయి. వ్యయ ప్రయాసలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులుంటాయి.
- సింహంభట్ల సుబ్బారావు