‘మోడల్’ రంగు కాషాయం | bjp model The color orange | Sakshi
Sakshi News home page

‘మోడల్’ రంగు కాషాయం

Published Wed, Aug 6 2014 12:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

‘మోడల్’ రంగు కాషాయం - Sakshi

‘మోడల్’ రంగు కాషాయం

‘అభివృద్ధి మంత్ర దండం’గా తెగ ఊదర గొట్టిన ‘గుజరాత్ మోడల్’ నిజ స్వరూపం అప్పుడే బట్టబయలవుతోంది. అది అసలు సిసలు ప్రపంచ బ్యాంకు, దేశ విదేశీ కార్పొరేటు సంస్థల ‘అభివృద్ధి నమూనా’ అని తేలిపోతోంది. వినాశకరమైన ఈ ‘నమూనా’ జాతీయ స్థాయిలో కుమ్మరి పురుగులా చరిత్ర రచనలోకి, పాఠ్యాంశాలలోకి చొరబడుతోంది!
 
‘‘వాడే కామమ్మ మొగుడంటే,’’అతడి ముఖం కూడా చూడని అమ్మల క్కలు, అయ్యలంతా కలిసి ‘‘అవును, కామమ్మ మొగుడే’’ సందేహం లేదని ప్రచారంలోకి దిగేశారట! అలాగే ముక్కూ ముఖం తెలియని ‘గుజరాత్ మోడల్’ కూడా ‘అభివృద్ధి మంత్ర దండం’గా ఇటీవలి సార్వత్రిక  ఎన్నికల్లో తెగ ఊదరగొట్టేశారు. నరేంద్ర మోడీ ప్రధాని పదవీ స్వీకారం చేసిన మూడు మాసాలలోనే అభివృద్ధి ముసుగులో దాగిన ఆ ‘మోడల్’ నిజస్వరూపం వెల్ల డికాక తప్పడం లేదు. ఆ నమూనా క్రమంగా చాపకింది నీరులా అమలులోకి వచ్చేస్తోందని ప్రజలకు తెలిసిపోతోంది. మేక తోలు కప్పుకున్నంత మాత్రాన పులి నైజం మారిపోతుందా? మంత్రివర్గ ఏర్పాటుతోనే మోడీ ఈ ‘నమూ నా’ను గుజరాత్ సరిహద్దులు దాటించి జాతీయ స్థాయిలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు! అందుకోసం ఆయన చేసిన మొట్ట మొదటి పని - తన చేతికి మట్టి అంటకుండా తన పనిని ఇతరులు సాధించి పెట్టేలా నిర్వహించడం. అందుకు తొలి ఉదాహరణ, ముఖ్యమైన శాఖ లను నిర్వహించే కార్యదర్శుల్ని 2002 గుజరాత్ ఊచకోతల సమయంలో లేదా తన ముఖ్యమంత్రిత్వ హయాంలో పని చేసిన వారిని కేంద్రంలో నియమించటం! ఆ తరువాత కేబినెట్ మం త్రులను డమ్మీలను చేసి వారితో నిమిత్తం లేకుండా నేరుగా కార్య దర్శులతోనే ప్రధానంగా చర్చలు జరపడం, తద్వారా తాను ఏ నిర్ణయాలు తీసుకుందీ, ఏ ఆదేశాలు యిచ్చి ఉన్నదీ మంత్రివర్గ సహచరులకు తెలియరాకుండా కార్యదర్శులకు మంత్రులకు మధ్య విలక్షణమైన అంతరాన్ని పెంచడం!  

‘మోడల్’ అసలు స్వరూప, స్వభావాలు

‘గుజరాత్ మోడల్’ అనగానే గుర్తుకొచ్చేది 2002 నాటి రెండు వేల మంది మైనారిటీల ఊచకోత! ఇక ఈ ‘నమూనా’, ‘అభివృద్ధి మంత్రం’ ముందు కొచ్చింది మాత్రం ఎన్నికలకు ముందు ఏడాదిన్నర క్రితం. అదీ ‘ట్విటర్’ ట్వీట్స్ ద్వారా ‘సోషల్ మీడియా’ ఊదర ద్వారా! ప్రధాన మంత్రిగా, ‘భద్ర పురుషుడి’గా ఉద్యోగంలో ‘స్థిరపడిన’ తర్వాత ఇప్పుడు కూడా మోడీ ‘ఆదేశా లపైన’ ఆధారపడుతున్నారు? మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు తగ్గించి సోషల్ మీడియానే వినియోగించుకోవాలన్న స్వీయ ఆదేశాలపైన! ఆది నుంచి ఆర్.ఎస్.ఎస్. పరివార్ మత సంస్థల పట్టులోనే ఉంటూ వచ్చిన మోడీ పార్టీ నిర్మాణంలో మెతగ్గా కన్పించే నాయకుల స్థానంలో బెరుకులేని ‘కరకు’ సరుకు (హార్డ్ కోర్)ను ప్రవేశపెట్టారు. అలాంటి వారిలో ముఖ్యులు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, షొరాబుద్దీన్ దంపతుల హత్య కేసుల నుంచి గత ఎనిమిదేళ్లుగా బయటపడకపోయినా బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నియమి తులైన అమిత్ షా, మరో హార్డ్‌కోర్‌గా పేరున్న ఆంధ్ర నేత రామమాధవ్! వీ రందరి అసలు ఎజెండా ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదం ఆధ్వర్యంలోని ప్రపంచ బ్యాంకు, దేశ విదేశీ కార్పొరేటు సంస్థల ‘అభివృద్ధి నమూనా’నే. ఉభయ పక్షాలకూ ఆదర్శమూ, అభివృద్ధి నమూనాలు, దేశీయ అదానీలు, అంబానీలే! అందుకే, బ్యాంకింగ్, బీమా రంగాలలో, ప్రభుత్వ రంగ సంస్థ లలో చివరికి పాడికుండల్లాంటి ‘నవ రత్నాల’యిన సంస్థలలోని వాటాలను గుత్త సంస్థలకు ‘‘ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల’’ పేరిట ఇంతకు ముందున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేయడమూ! ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదే శాల మేరకే వ్యవసాయ, లఘు పరిశ్రమలకు యిచ్చే సబ్సిడీలలో కోత పడు తోంది. రిటైల్ మాల్స్‌లో బహుళజాతి సంస్థలను అనుమతించబోమని చెబు తూనే-‘ప్రస్తుతానికే’ననే హంసపాదును తగిలించి, రేపు ‘ప్రవేశ ద్వారాలు’ తెరుస్తామని చెప్పక చెప్పింది మోడీయే! గుజరాత్‌లో సేద్య భూములను కారు చౌక ధరలకు బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టినందున గత పదేళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పత్రికలు వెల్లడించాయి!  

మోడీ మార్కు ‘చరిత్ర’

ఇక ఇప్పుడు ఈ వినాశకరమైన ‘గుజరాత్ మోడల్’ కుమ్మరి పురుగులా జాతీయ స్థాయిలో పాఠ్యాంశాలలోకి చొరబడుతోంది! రాజ్యాంగం ప్రకటిం చిన మతాతీత లౌకిక సెక్యులర్ వ్యవస్థ బహుళజాతుల, విభిన్న మతాల, పలు భాషల, భిన్న కులాల ప్రత్యేక సంస్కృతీ సంప్రదాయాలున్న భారత దేశంలో కులం, మతం, జన్మ స్థల వివక్షపైన, దేశ పౌరుల సమాన హక్కు లకు, పౌర జీవనం సాఫీగా సాగడానికి విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించరాదని రాజ్యాంగం శాసిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన పౌర బాధ్యత 51(ఎఫ్) దేశ ఉమ్మడి సంస్కృతినీ, సుసంపన్న (మంచి) సంప్రదాయాలను గౌరవించి రక్షించడాన్ని, 51 (హెచ్) క్లాజు శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసను, సంస్కరణ భావాలను పెంపొందించుకోవడాన్ని పౌర బాధ్యతగా స్పష్టంగా పేర్కొన్నాయి. అది విస్మరించి ఎన్‌డీఏ-1 నాడు చరిత్రను వక్రీకరిం చాలని ప్రయత్నించింది. నేడు ఎన్‌డీ ఏ-2 అదే చేస్తోంది. ఇందుకు ఊరూ పేరూ లేని కుహనా ఆచార్యులతో, సెక్యులర్ వ్యవస్థకు వ్యతిరేకులైన రచయి తలతో పాఠశాల పిల్లలకే గాక, పై తరగతుల విద్యార్థులకు సైతం పాఠ్య పుస్తకాలు రాయిస్తున్నారు. ఇప్పుడు మోడీ హయాంలో చరిత్ర పరిశోధనతో సంబంధంలేని ఒక శివానంద మూర్తికి సన్నిహితుడైనంత మాత్రానే ఒక ప్రొఫెసర్‌ను ‘భారత ఇతిహాస (చరిత్ర) పరిశోధనా మండలి’ నూతనాధ్య క్షుడిగా నియమించారు. అతని విద్వత్ సంబంధమైన అర్హతలను సుప్రసిద్ధ చరిత్రకారిణి రోమిలా థాపర్ ప్రశ్నించడం ఒక పెద్ద సవాలుగా మారింది!

విద్యారంగ ‘సంస్కరణ’

‘విద్యా సంస్కరణల’ పేరిట మోడీ ప్రభుత్వం మరో కమిషన్‌ను వేయాలని నిర్ణయించింది. ఎందుకు? గత 65 ఏళ్లలో వచ్చిన విద్యాకమిషన్‌లలో కొఠారీ కమిషన్ సిఫారసులు విశిష్టమైనవి. అయినా వాటిని చాపలా చుట్టే శారు. బీజేపీ వ్యక్తిగా, వివాదాస్పదునిగా పేరు మోసిన దీనానాథ్ బాత్రా విద్యారంగాన్ని ‘హైందవీకరించడం’ కోసం తానే ఒక ప్రభుత్వేతర (ఎన్. జి.ఓ) విద్యాకమిషన్‌ను ఏర్పరచి ఢిల్లీలో మకాం పెట్టాడు! దాని బోర్డు లోని 31 మంది సభ్యుల్లో 15 మంది మాత్రం ‘ప్రసిద్ధ విద్యావేత్త’లట. ఇందులో ఒక విద్యావేత్త  కమావున్ యూనివర్సిటీ మాజీ  వైస్-చాన్స్‌లర్ బి.ఎస్. రాజ్‌పుట్. ఈయన స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ ‘నల్ల బిలాల’పై (బ్లాక్ హోల్స్) సమర్పించిన పరిశోధనా పత్రాన్ని కాపీ కొట్టినందుకు 2003లో అభిశంసనకు గురై వైస్-ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయవలసి వచ్చినవారు! అలాంటి సభ్యుడున్న ‘‘భారతీయ సంస్కృతి’’ నరనరానా వంటబట్టిన ‘‘విద్యా నమునా’’లను పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్నట్టు బాత్రా చెప్పాడు! ఇప్పటికే వాటిలో కొన్ని కోర్సులను కొన్ని యూనివర్సిటీలలో ప్రవేశపెట్టారని అన్నాడు. జలంధర్‌లోని పంజాబ్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రానికి బదులు ‘‘వేద గణితం’’ ప్రవేశపెట్టారట. గుజరాత్‌లో కొన్నేళ్లుగా బాత్ర పాఠ్య పుస్తకాల ద్వారా బీజేపీ హిందూత్వ మత విలువల్ని వ్యాపింపజేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అన్నిటికన్నా మరువరాని పరిణామం-2004లో గుజరాత్ ప్రభుత్వ 9వ క్లాసు సైన్స్ పాఠ్య పుస్తకంలో నాజీ నియంత హిట్లర్‌ను ‘‘జాతీయవాదిగా’’,   ‘‘సోషలిస్టుగా’’ ప్రశంసలు కురిపించడం! గుజరాత్ మారణ హోమానికి బాధ్యురాలైన నాటి ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపైన సుప్రీం కోర్టు ఆఖరు మాట తీర్పుగా రావలసే ఉంది! ఈ నేపథ్యంలో సిట్ చైర్మన్ ఆర్.కె. రాఘవన్ చేతులు కూడా మలినం కావడం, సుప్రీం ప్రత్యేక ప్రతినిధి రాజు రామచంద్రన్ అందుకు సాక్షి కావటం హైలైట్! అసలు ‘నమూనా’ అంటే అదీ!  చివరికి న్యాయ వ్యవస్థను కూడా అవమానించగలదీ ‘మోడల్’!

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)  ఏబీకే ప్రసాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement