ప్రభుత్వ పాఠశాలల్లో డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యా యులు, సంఘాలలో చలనం వచ్చినట్లు కనిపిస్తోంది. ఉపాధ్యాయ సంఘాల వైఖరిలో గుణాత్మకమైన మార్పు కనబడుతుంది. ఇది మంచి పరిణామం. డిటెన్షన్ విధానాన్ని అమలు చేసే ప్రతిపాదన రావడానికి ఎన్ని కారణాలున్నా పరోక్షంగా ఉపాధ్యాయులూ కారణమనే విషయం అందరికీ తెలుసు. ఉపా ధ్యాయుల వైఫల్యాలను విద్యార్థులపై రుద్ది డిటెన్షన్ అంటగట్టవద్దు. విద్య లో నాణ్యతకు మేమే బాధ్యులం అనే అభిప్రాయానికి ఉపాధ్యాయులు, సంఘాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆలస్యంగానైనా, ఆత్మావలోకనం ద్వారా వాస్తవాల్ని ఉపాధ్యాయవర్గం గ్రహించడం హర్షణీయం. ఇకనైనా ఉపాధ్యాయ వర్గం విద్యార్థుల మధ్య ఉంటూ విద్యా కార్యక్రమాల్లో నిమగ్నం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు వారు హామీ ఇస్తే డిటెన్షన్ ప్రతిపాదన తాత్కాలికంగానైనా వాయిదా పడుతుందేమో? అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యా చట్టాలను, నియమ నిబంధనలను పటిష్టంగా అమ లు చేస్తే డిటెన్షన్ విధానాన్ని పెట్టాల్సిన అవసరం రాదు. పాఠశాలలకు సదుపాయాలు కల్పించి, సిబ్బందిని నియమించి, నిరంతర పర్యవేక్షణను కొనసాగించినట్లయితే వ్యవస్థ గాడినపడగలదు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి, సరైన లక్ష్యం కొరవడినందునే ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థలో అవాంఛిత రుగ్మతలు పొడసూపుతున్నాయి. ఏదిఏమైనా వ్యవస్థను సరిదిద్దుకోవాలి తప్ప డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం శ్రేయస్కరం కాబోదు. ఆ ప్రతిపాద నను విరమించుకోవాలి.
- కె.వి.కౌసల్య, నల్లగొండ
డిటెన్షన్ గుణపాఠం!
Published Mon, Sep 14 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement