నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులకు ఆత్మబలిదానం తప్పదా?
మనందరి స్పప్నం మన తెలంగాణ రాష్ట్రం. దశా బ్దాల పోరాటం తర్వాత మన కల సాకారమైంది. కాని ఆ కల మా డీఎస్సీ నిరుద్యోగుల పాలిట శాపం లా మారిందనిపిస్తోంది. లక్షలాదిమంది ఉపాధ్యా య శిక్షణ పూర్తి చేసుకుని 2012 నుంచి వేయికళ్లతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభు త్వాల అనాలోచిత నిర్ణయాలు నిరుద్యోగుల జీవితా లను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి.
2013 జూన్ 28న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్ కిరణ్ కుమార్‌రెడ్డి మొత్తంగా 20,508 పోస్టులను, దానిలో తెలంగాణ ప్రాంతానికి 10,038 పోస్టులతో నోటిఫికేషన్ సిద్ధం చేస్తే టీఆర్‌ఎస్ నాయ కులు అడ్డుపడ్డారు. ఉమ్మడి నోటిఫికేషన్‌లు ఇస్తే మరోసారి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరు గుతుందని, తెలంగాణ ఏర్పడగానే తామే డీఎస్సీ నిర్వహించుకుంటామని అప్పట్లో హరీశ్‌రావు, కేటీ ఆర్, ఈటెల రాజేందర్ అడ్డుకుని నోటిఫికేషన్‌ను నిలిపేసేలా చేశారు. తెలంగాణలో నూతన ప్రభు త్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీ ఆర్ గత ఆగస్టు 15న ప్రకటించిన 50 వేల ఉద్యోగాలలో సింహ భా గం డీఎస్సీ ఉద్యోగాలేనని తెలిపా రు. ఈ విషయమై రాష్ట్ర తొలి విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి హా మీ ఇస్తూ, దసరా సెలవుల్లోపు ఉపాధ్యాయుల సర్వీ సు రూల్స్ పదోన్నతులు, బదిలీలు చేపట్టి దీపావళి నాటికి డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మరో మారు ఆయన్ను కలిస్తే 2015 జనవరి సంక్రాంతి లోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూన్‌లోగా నియా మక ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నూతన మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖను సమర్థవంతంగా ముందుకు తీసుకెళతారని, నిర్ణ యాలు వేగంగా తీసుకుంటారని ఊహించాం. కానీ రేషనలైజేషన్ పేరుతో నెలల తరబడి డీఎస్సీ నోటిఫి కేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేయడం, అసలు పట్టించుకోకపోవడం భావ్యమా. నిజంగా ఇదే కారణమైతే ఎంఈఓలు, డీఈ ఓల వద్ద విద్యార్థులకు, ఉపాధ్యా యులకు సంబంధించిన పూర్తి గణాంకాల వివరాలు డైస్ రూపం లో ఉన్నాయి. మండలాలు, జిల్లాల వారీగా ఎక్కడ ఉపాధ్యాయుల అవ సరం ఉంది, ఎక్కడ అవసరం లేదు అనే విషయాన్ని ఒకే రోజులో తెలుసుకోవచ్చు. దానికి ఇంత కాల యాపన అవసరం లేదు. పైగా రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను మూసివేస్తామని పేర్కొనడం వల్ల దళి త, గిరిజన ప్రాంత విద్యార్థులకు విద్య దూరం చేయడమే అవుతుంది.
కానీ నేటివరకు తెలంగాణ డీఎస్సీ గురించిన ఊసే లేకుండా ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోం ది. విద్యాహక్కు చట్టం సెక్షన్-23 ప్రకారం టెట్, డీఎస్సీల నియామకం విధిగా జరపాలని, సెక్షన్- 26 ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలు 10 శాతం కంటే ఎక్కువగా లేకుండా చూసుకోవాలని స్పష్టంగా చెపు తోంది. 2013 జూన్ నుంచి నేటికి ఉపాధ్యాయ ఖాళీ లు 10 వేల నుంచి 20 వేలకు చేరుకున్నాయి.
మరోవైపు, రాజధాని కూడా లేని, లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించింది. మిగులు బడ్జెట్ ఉండి, నిరుద్యోగుల పోరాటంతో అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం డీఎస్సీని విస్మరించింది. ప్రభుత్వం ఇకనైనా ప్రభుత్వ పాఠ శాలల బలోపేతం దిశగా చర్యలు తీసుకుని, 15 రోజుల్లోగా డీఎస్సీపై విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా డీఎస్సీపై ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష పార్టీ నేతలందరికీ నిరుద్యోగుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. జూన్-2 లోగా డీఎస్సీపై స్పష్టమైన ప్రకటన లేనిచో జూన్ 2న 10 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్య ర్థులు ఆత్మబలి దానాలు చేసుకోవటం తప్ప మరో మార్గం కనిపించడం లేదని తెలియచేస్తున్నాం.
వై. రమణ
నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థుల వేదిక