
గ్రహం అనుగ్రహం, బుధవారం 26, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు..
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం, తిథి శు.ఏకాదశి ఉ.7.34 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం పూర్వాషాఢ రా.7.40 వరకు
వర్జ్యం ఉ.5.24 నుంచి 7.01 వరకు
తదుపరి తె.3.27 నుంచి 5.00 వరకు
(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం ఉ.11.35 నుంచి 12.27 వరకు
అమృతఘడియలు ప.2.55 నుంచి 4.27 వరకు
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం: 6.15
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు నెలకొంటాయి.
వృషభం: నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధు వర్గంతో తగాదాలు రావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తి కరమైన సమాచారం అందుతుంది. విందు వినోదాలు. పనుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. వస్తు లాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కన్య: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు ప్రదర్శిస్తారు. అనారోగ్యం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు రావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తి కరమైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు. పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని వివాదాల పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. అరుదైన సన్మానాలు జరుగుతాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం అందుతుంది.
మకరం: వ్యయ ప్రయాసలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. పనుల్లో జాప్యం జరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మీనం: వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. బాకీలు వసూలవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
- సింహంభట్ల సుబ్బారావు