
భూతాప ప్రకోపం ఎదుర్కోక తప్పని ఉపద్రవం
శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేయడం మనందరికీ ఉపయోగకరం. ఏడాదికి 12 లక్షల మందికి పైగా భారతీయులు ఒక్క కాలుష్యం వల్లనే మరణిస్తున్నారు. అయితే, వాతావరణ మార్పుపై మన మీడియా దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వంపైనా, పరిశ్రమపైనా వేగంగా మారాలనే ఒత్తిడి తగినంతగా ఉండటం లేదు. మన దేశంలోనే గాక ప్రపంచం పైనే అపార దుష్ప్రభావాలను కలుగజేసే వాతావరణ మార్పు, యూరప్‌లో ఒక ప్రధాన ఎన్నికల సమస్య. అలా ప్రధాన సమస్యగా దీనిని చేపట్టడం మనం తప్పక నెరవేర్చాల్సిన కర్తవ్యం.
మన మీడియా దృష్టిని కేంద్రీకరించడం లేదు గానీ ప్రపంచానికి ఇది విపత్కర సమయం. భూతాపోన్నతని తగ్గించడానికి దోహదపడటం కోసం తన వంతు కృషి చేస్తానని చేసిన వాగ్దానం నుంచి అమెరికా వెనక్కు మళ్లింది. 2015లో సంత కాలు జరిగిన పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు తమ పారిశ్రామిక కర్మాగా రాలు, ఆటోమొబైల్స్ వెలువరించే కార్బన్ డయాక్సైడ్ (ఇౖ2) ఉద్గారాలను తగ్గించుకుంటామని అంగీకరించాయి. బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల వాడకాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకుని, సౌర, పవన విద్యుత్తులకు మరలడం ద్వారా ఇది జరుగుతుంది. సౌర విద్యుత్తుకు భారత్ ఇప్పటికే అతి పెద్ద మార్కె ట్‌గా ఉంది. ఆ కారణంగానే సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయాయి.
ప్రపంచ దేశాలన్నీ తాము సంతకాలు చేసిన ఆ ఒప్పందంలో వాగ్దానం చేసిన కర్తవ్యాలను పరిపూర్తి చేసినట్టయితే... పారిశ్రామికీకరణకు ముందటితో పోలిస్తే ప్రపంచవ్యాప్త భూతాపం పెరుగుదల 20ఇకు పరిమితం అవుతుంది. ఇౖ2 ఉద్గా రాల వెలువరింతకు చైనా అతి పెద్ద వనరుగా ఉంది. ప్రపంచ కర్బన ఉద్గారాలలో 30% అదే వెలువరిస్తోంది. దాని తర్వాతి స్థానాలలో అమెరికా (15%), యూరో జోన్ (9%) ఉన్నాయి. భారత్ 7% ఉద్గారాలను వెలువరిస్తున్నా ప్రపంచ జనా భాలో 15% దానిదే. కాబట్టి తలసరి ప్రాతిపదికపై చూస్తే చైనా, అమెరికాల వల్ల తలెత్తుతున్నంత సమస్య భారత్ వల్ల కలగడం లేదు.
అయితే, భారత్ వేగంగా పారిశ్రామికీకరణం చెందుతోంది, విద్యుత్తు, పెట్రోలు, డీజిల్‌ను వాడే మధ్యతరగతి పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇతరుల వల్ల తలెత్తుతున్న సమస్యతో పోల్చి మనం ఈ సమస్యను విస్మరించలేం. ఈ విష యంలో దూరదృష్టిని, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని మనం ప్రశంసించాల్సిందే. ‘‘పారిస్ ఒప్పందం ఉన్నా లేకున్నా, వాతావరణ పరిరక్షణ కోసం మేం చేసిన వాగ్దానం భవిష్యత్ తరాల కోసం చేసినది’’ అని ఈ వారంలో ఆయన అన్నారు. 2030 నాటికి భారత్‌లో అమ్మే కార్లన్నీ విద్యుత్ కార్లే అయి ఉంటాయని భారత ప్రభుత్వం సైతం చెప్పింది. అది ఎలా జరుగుతుందనే దానికి సంబంధించిన వివరాలు తెలియవు కానీ... మోదీ ఆ లక్ష్యాన్ని సాధిస్తే, అది ఆయనను నిజమైన ప్రపంచ నేతను చేస్తుంది.
ఈలోగా ట్రంప్, వాతావరణ మార్పు కంటే అమెరికన్లకు ఉద్యోగాలను కల్పించడానికే తాను ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. పారిస్ వాగ్దానాలకు కట్టుబ డినట్టయితే వచ్చే ఏడేళ్లలో అమెరికా 27 లక్షల ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుం దని అన్నారాయన. అది వివాదాస్పదమైనది, గత దశాబ్దిగా అమెరికాలో అతి పెద్ద ఉపాధి కల్పనాదారుగా ఉన్నది విద్యుత్, సౌర విద్యుత్ కార్ల పరిశ్రమే. అమెరికా తప్పుడు నిర్ణయం తీసుకున్నదని ఆ దేశంలోని అతి పెద్ద కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు అంటున్నారంటేనే ట్రంప్ ఎంతగా ఏకాకి అయ్యారో స్పష్టమౌతోంది. వాతావరణ మార్పు కారణంగా కాకపోయినా ఆర్థిక లాభదాయకత, సమర్థత దృష్ట్యానైనా శిలాజ ఇంధనాల నుంచి ఇతర ఇంధనాలకు మరలడం కొనసాగు తుందని ఆశించాలి.
వాతావరణ మార్పుకు సంబంధించిన దత్తాంశాలు పూర్తి స్పష్టంగా ఉండటం వల్లనే మనకు ఇది విపత్కర సమయమని అన్నాను. 1880 నుంచి భూ ఉపరితల ఉష్ణోగ్రత సగటున ప్రతి దశాబ్దికి 0.0070ఇ వేగంతో పెరుగుతోంది. అది ఇప్పటి వరకు నికరంగా 0.950ఇ మేరకు తాపం పెరిగింది. సముద్రాల ఉష్ణోగ్రతలకంటే భూమి ఉష్ణోగ్రతలు ఇంతవరకు వేగంగా పెరిగాయి. అయితే, ప్రపంచ దేశాలు తమ ఉద్గారాల వెలువరింతను తగ్గించుకోకపోతే 2030 నాటికి ఈ పరిస్థితి మారు తుంది. ఒకసారి సముద్రాలు వేడెక్కడం ప్రారంభమైతే పలు దేశాలు వెంటనే లోతైన సమస్యల్లో పడతాయి.
మూడు విధాలుగా ఇది భారతీయులకు ఉపద్రవకరంగా పరిణమిస్తుంది. వాతావరణ మార్పు అంటే సముద్రాల మట్టం పెరగడం. కాబట్టి అది ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి సముద్ర తీర సమీప నగరాలకు పెను సమస్యలను సృష్టి స్తుంది. రుతు పవనాలు మరింత చంచలంగా, అనూహ్యమైనవిగా మారడానికి దారితీస్తుంది. ఇది భారత రైతును దయనీయ స్థితిలోకి నెడుతుంది.
ఇక మూడవ సమస్య మనం బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని కొన సాగించేట్టయితే తలెత్తుతుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశాలలో విస్తరించిన ఆది వాíసీ ప్రాంతం బొగ్గు వనరులకు నెలవు. అతి క్రూర దోపిడీకి గురవుతున్న అక్కడి ఆదివాసులు మనకు బొగ్గును సమకూర్చడం కోసం తమ అడవులను, భూము లను వదులుకోక తప్పదు. భారతరత్న లతామంగేష్కర్ ఇంటి ఎదురుగా ఒక ఫ్లైఓవర్‌ను నిర్మించతలపెట్టినా, ఆమె దేశాన్ని వీడిపోతానని బెదిరించడంతోనే దాన్ని రద్దు చేశారు. ఆదివాసులకు ఆ శక్తి లేదు, వారు తమ భూములను వదులు కోక తప్పదు. మనమే గనుక సౌర, పవన విద్యుత్తులకు మరలితే వారిని ఇలా దోచుకోడాన్ని నివారించవచ్చు.
శిలాజ ఇంధనాల వాడకాన్ని నిలిపివేయడం మనందరికీ ఉపయోగకరం. ఏడాదికి 12 లక్షల మందికి పైగా భారతీయులు కాలుష్యం వల్ల మరణిస్తున్నారు. అయితే, వాతావరణ మార్పుపై మన మీడియా దృష్టిని కేంద్రీకరించడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వంపైనా, పరిశ్రమపైనా వేగంగా మారాలనే ఒత్తిడి తగినంతగా ఉండటం లేదు. భారతదేశంపైనే గాక మొత్తం ప్రపంచంపైనే అపార పర్యవ సానాలకు దారితీసే ఈ సమస్యపైకి దృష్టిని కేంద్రీకరించేలా చేయడానికి మనం ట్రంప్ నిర్ణయాన్ని వాడుకోవాలి. వాతావరణ మార్పు, యూరప్‌లో ఒక ప్రధాన ఎన్నికల సమస్య. అభ్యర్థులు ఆ సమస్యపై తాము తప్పక చేయాల్సిందేమిటో వాదోపవాదాలను సాగించాల్సి ఉంటుంది. భారత ఓటరు, ప్రత్యేకించి ఈ సమ స్యను గురించి ఎరిగిన విద్యాంతుడైన మధ్యతరగతి ఓటరు మన దేశంలో కూడా అలా జరగడానికి హామీని కల్పించి తీరాలి. ఇది మన కోసం, మన తరువాతి తరాల కోసం నెరవేర్చాల్సి ఉన్న కర్తవ్యం.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com